in ,

వన్టే ర్యాంకింగ్స్‌ టాప్ 10లో భారత్ బ్యాటర్లు

వన్టే ర్యాంకింగ్స్‌ టాప్ 10లో భారత్ బ్యాటర్లు

ఐసీసీ తాజాగా వన్టే ర్యాంకింగ్స్‌ టాప్ 10లో ముగ్గురు భారత బ్యాటర్లకు చోటు దక్కింది. కాగా ఈ టాప్ 10 లో పాక్ ఆటగాళ్లు కూడా ఉండడం విశేషం.

వివరాల్లోకి వెళ్తే తాజాగా ఐసీసీ వన్టే ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. అందులో టాప్ 10 లో ముగ్గురు భారత బ్యాటర్లకు చోటు దక్కింది. శుభ్‌మన్‌ గిల్‌ అత్యుత్తమంగా రెండో ర్యాంకు సాధించగా .. రోహిత్‌ శర్మ 8వ స్థానంలో, విరాట్ కోహ్లి 9వ స్థానంలోనూ నిలిచారు.

కాగా పాకిస్థాన్ బ్యాటర్లు కూడా ఈ టాప్‌-10లో స్థానం దక్కడం విశేషం. బాబర్‌ అజామ్‌ నంబర్‌వన్‌ బ్యాటర్‌గా కొనసాగుతుండగా.. ఇమాముల్‌ హక్‌ ఐదొవ స్థానంలో, ఫకర్‌ జమాన్‌ 10 స్థానంలో నిలిచారు.

What do you think?

మళ్లీ అప్పు చేసిన ఏపీ ప్రభుత్వం. 2వేల కోట్లు..

జనసేన, టీడీపీ కలిసే పోటీ.. అధికారికంగా ప్రకటించిన పవన్ కళ్యాణ్