ఇన్‌స్టాలో ఒక్కో పోస్ట్ కి 11 కోట్లు తీసుకుంటున్న కోహ్లీ
విరాట్ కోహ్లీ సోషల్ మీడియా లో ఒక్కో పోస్ట్ కి 11 కోట్లు తీసుకుంటున్నాడు. దీంతో ప్రపంచంలోనే ఇంత మొత్తంలో ఆర్జిస్తున్న వారిలో మూడో స్థానంలో నిలిచాడు.
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాలో 256 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన ఇన్‌స్టా ఖాతా ద్వారా ఆర్జిస్తున్న మొత్తం నెట్టింట సంచలనంగా మారింది. ఆయన తన ఇన్‌స్టా ఖాతాలో ఒక్కో పెయిడ్ పోస్ట్ కి రూ.11.45 కోట్లు తీసుకుంటున్నారని సమాచారం.
కాగా సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఒక్కో పెయిడ్ పోస్ట్ కు రూ.26.75 కోట్లు తీసుకుంటూ ఫుట్‌బాల్ సూపర్స్టార్ క్రిస్టియానో రొనాల్డో ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్జిస్తున్న ఆటగాళ్లలో మొదటి స్థానంలో నిలువగా, మరో ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ 21.49 కోట్లు తీసుకుంటూ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మన ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి రూ.11.45 కోట్లు తీసుకుంటూ మూడో స్థానంలో నిలిచాడు.
దీంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.