in

మళ్లీ అప్పు చేసిన ఏపీ ప్రభుత్వం. 2వేల కోట్లు..

మళ్లీ అప్పు చేసిన ఏపీ ప్రభుత్వం. ఈ సారి 2వేల కోట్లు

ఏపీ ప్రభుత్వం అప్పులను క్రమక్రమంగా పెంచుకుంటూ పోతోంది. ఇప్పటికే వేలకోట్లు అప్పులు చేసిన జగన్ సర్కార్ ఇప్పుడు మళ్లీ అప్పు చేసింది.

నిధులు లేక ఆగస్టు నెల ఉద్యోగులకు జీతాలు, పెన్షన్‌లు ఆలస్యంగా వేసిన ఏపీ ప్రభుత్వం ఈ మంగళవారం రూ.2 వేల కోట్లు అప్పు చేసింది. అందులో రూ.1,000 కోట్లను 7.46 శాతం వడ్డీతో 18 ఏళ్లలోగా, మరో రూ.1,000 కోట్లను 7.48 శాతం వడ్డీతో 15 ఏళ్లలోగా పూర్తిగా చెల్లించాలి.

కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదున్నర నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.61,500 కోట్లకు పైగా అప్పులు చేయడం గమనార్హం. ఇందులో ఆర్‌బీఐ ద్వారా రూ.40,500 కోట్ల రుణాలు తేగా.. కార్పొరేషన్లు, ఇతర మార్గాల ద్వారా రూ.21,000 కోట్ల పైచిలుకు రుణాలు తెచ్చారు.

What do you think?

కేరళలో కలవర పెడుతున్న నిఫా వైరస్

వన్టే ర్యాంకింగ్స్‌ టాప్ 10లో భారత్ బ్యాటర్లు