in

13 ఏళ్ల చిన్నారి గుండెపోటుతో కన్నుమూత!

13 ఏళ్ల చిన్నారి గుండెపోటుతో కన్నుమూత!

వయసుతో సంబంధం లేకుండా చిన్న, పెద్ద అందరూ గుండెపోటుతో చనిపోతున్నారు. ఆడుకునే వయసులోనే హఠాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి మరో విషాదమే మళ్లీ జరిగింది. ఓ 13 ఏళ్ల చిన్నారి గుండెపోటుతో కన్నుమూసింది. ఈ హృదయ విదారక ఘటన కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అనంతారంలో చోటు చేసుకుంది.

 

వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అనంతారం చెందిన నీహారిక అనే 13 ఏళ్ల చిన్నారి శనివారం కడుపు నెప్పి వస్తుందని చెప్పింది. దీంతో తల్లిదండ్రులు చిన్నారిని మణుగూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే పరిస్థితి విషమించడంతో భద్రాచలంలోని ఆసుపత్రికి తరలించారు.

కానీ ఈ లోపే విషాదం జరిగిపోయిందని పాప గుండెపోటుతో చనిపోయిందని అక్కడి వైద్యులు నిర్థారించారు. ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోయిన తల్లిదండ్రులు నిహారికను భద్రాచలంలోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ అక్కడి వైద్యులు కూడా పాప గుండెపోటుతో చనిపోయిందని మరోసారి నిర్ధారించారు.

అప్పటి వరకూ బాగానే ఉన్న కూతురు హఠాత్తుగా మరణించడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.

What do you think?

ఉమ్మడి కృష్ణాజిల్లాలో మృతదేహాల కలకలం!

రణ్వీర్ సింగ్ “పుష్ప – 2” కనిపించబోతున్నాడా?