in

రివ్యూ : లవ్ టుడే సినిమా (ఇప్పుడు Netflix లో)

రివ్యూ : తమిళ్లో భారి విజయాన్ని అందుకున్న లవ్ టుడే సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందనే ఉద్దేశంతో నిర్మాత దిల్ రాజు ఆ సినిమాను అనువదింపచేసి తెలుగు రాష్ట్రాలలో కూడా విడుదల చేయించారు. ఇక సినిమా విషయానికి వస్తే ప్రదీప్ రంగనాథన్ కథ కోసం తీసుకున్న అంశం,దాన్ని అందరికి నచ్చే విధంగా రచించి తెరకెక్కించిన విధానం బాగుంది. అదే విధంగా ప్రదీప్ రంగనాథన్ తను రాసుకున్న ప్రధాన పాత్రలో చాలా బాగా ఒదిగి పోయాడు. ఇవాన తన పాత్రలో ఇమిడి పోగా, రవీన రవి, సత్యరాజ్,రాధిక శరత్ కుమార్,యోగిబాబు తమ పాత్రలకు న్యాయం చేశారు. యువన్ శంకర్ రాజ అందించిన సంగీతం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. సినిమా మొదటి నుంచి చివరి వరకు చాలా ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

బలాలు:

  • కథ,కథనం, దర్శకత్వం
  • సంగీతం
  • నటీనటులు

బలహీనతలు:

  • ద్వితియార్థంలోని కొన్ని సాగే సన్నివేశాలు

చివరిగా: లవ్ టుడే… చూడదగిన సినిమా.

నటీనటులు:ప్రదీప్ రంగనాథన్, ఇవాన, రవీన రవి, సత్యరాజ్,రాధిక శరత్ కుమార్,యోగిబాబు తదితరులు , దర్శకత్వం: ప్రదీప్ రంగనాథన్, సంగీతం: యువన్ శంకర్ రాజ, నిర్మాతలు: గణేష్, సురేష్ ,అఘోరం, కెమెరా: దినేష్ పురుషోత్తమన్

What do you think?

96 Points
Upvote Downvote

రాజమౌళి దర్శకత్వంలో చిరంజీవి నటించబోతున్నారా….?

సైనికుడు….అగ్నివీరుడు అవుతాడా! అసలేంటీ అగ్నిపత్ స్కీము?