in

రాజమౌళి దర్శకత్వంలో చిరంజీవి నటించబోతున్నారా….?

రాజమౌళి సినిమా అంటేనే అది కచ్చితంగా చరిత్ర సృష్టిస్తుందని ప్రేక్షకులు గట్టిగా నమ్ముతారు. అలాంటిది

రాజమౌళి మెగాస్టార్ చిరంజీవితో కలిసి సినిమా తీస్తున్నారంటే ఇక ఆ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ఎవరూ ఊహించలేరు. ఇప్పుడు ఇది నిజమేనని,అగ్ర దర్శకుడు రాజమౌళి మెగాస్టార్ చిరంజీవితో కలిసి సినిమా తీయబోతున్నారని సినీ పరిశ్రమలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజమౌళి ఒక సినిమాను తీయడం మొదలు పెట్టిన తరువాత నుంచి చిత్రీకరణ పూర్తయ్యి,ఆ సినిమా విడుదలయ్యేంత వరకు వేరే సినిమా గురించి ఆలోచించరు. అలాంటిది ఇప్పుడు మహేష్ బాబుతో తీయబోతున్న సినిమా పట్టాలెక్కక ముందే తరువాత సినిమా గురించి ఆలోచూస్తున్నారట.

అయితే ఇటీవలే చిరంజీవిని రాజమౌళి కలిశారని, తాను తీయాలనుకుంటున్న సినిమా గురించి వివరించగా చిరంజీవి కూడా అంగీకారం తెలిపారని సినీ పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్కప్పుడు ఇలాగే రజినీకాంత్-రాజమౌళి సినిమా అని పుకారు పుట్టించగా దానికి రాజమౌళి స్పందిస్తూ తన దగ్గర రజినీకాంత్ కి సరిపడా కథ ఉంటే ఆయనతో తప్పకుండా సినిమా చేస్తానని, ప్రస్తుతానికి అవన్నీ పుకారులు మాత్రమేనని రాజమౌళి కొట్టిపడేశారు.

రాజమౌళి చిరూతో సినిమా తీయబోతున్నారన్న విషయం పై చిరంజీవి మాట్లాడుతూ “రాజమౌలి రెండు మూడు సంవత్సరాలు ఒక సినిమాతో ప్రయాణిస్తారు. నేను ఒక సంవత్సరంలో మూడు,నాలుగు సినిమాలు చేస్తాను, ఒకవేళ ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను.కానీ ప్రస్తుతానికైతే పాన్ ఇండియా హీరో కావాలనే ఆశా లేదు” అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. ఏదేమైనా వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారో.. లేదో.. తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.

What do you think?

120 Points
Upvote Downvote

అత్యుత్తమ సాంకేతికతతో ప్రభాస్-నాగ్ అశ్విన్ ప్రోజెక్ట్ కే ..!

రివ్యూ : లవ్ టుడే సినిమా (ఇప్పుడు Netflix లో)