in

అత్యుత్తమ సాంకేతికతతో ప్రభాస్-నాగ్ అశ్విన్ ప్రోజెక్ట్ కే ..!

ప్రోజెక్ట్ కే ..!

ఒక సినిమాను తెరకెక్కించడంలో కథ,కథనం ఎంత ముఖ్యమో దానిని తీయడానికి ఉపయోగించే కెమెరా కూడా అంతే ముఖ్యమైంది. రోజు రోజుకీ సినిమాను ప్రేక్షకులు చూసే విధానం మారుతుంది. దానితో పాటే వారు సినిమాలలో మెరుగైన సాంకేతికను కూడా కోరుతుంటున్నారు. అదే విధంగా దర్శక నిర్మాతలు కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త పరికరాలతో కెమెరాలతో సినిమాలను మరింత మెరుగ్గా తెరకెక్కిస్తున్నారు.

లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన విక్రమ్ సినిమాలో ” మోకోబాట్” అనే రోబోటిక్ కెమెరాతో కొన్ని సన్నివేశాలు తీయగా వాటిలో ఇంటర్వెల్లో వచ్చే సన్నివేశం అందర్నీ ఆకట్టుకుంది. తమిళ్ హీరో విజయ్ నటించిన బీస్ట్ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశాన్ని తెరకెక్కించడానికి కూడా ఇదే మోకాబాట్ ఉపయోగించారు.

అయితే ఇప్పుడు ఇలాంటి మైమరిపించే కెమెరాతోనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రోజెక్ట్ కే సినిమాను తెరకెక్కిస్తున్నారట. మహనటి సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ దర్శకుడుగా వ్యవహరిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ప్రోజెక్ట్ కే సినిమాను “అర్రి అలెక్సా డిజిటల్ మోషన్ పిక్చర్ కెమెరా సిస్టం” అనే అత్యుత్తమ సాంకేతిక కలిగిన కెమెరాతో తెరకెక్కిస్తున్నారట. తయారైనప్పటి నుంచి ఇప్పటివరకు ఈ కెమెరాతో కేవలం 8 సినిమాలను మాత్రమే తెరకెక్కించగా వాటిలో ఒకటైన హాలీవుడ్ సినిమా నోమడ్లాండ్ కు అకాడెమీ అవార్డులలో బెస్ట్ పిక్చర్ అవార్డ్ ఇచ్చారట. ఈ కెమెరాలు కరీదైనవి కావడంతో వీటిని  “పనవిషన్” లేదా “అరి” లాంటి ప్రముఖ కెమెరా సంస్థల నుంచి రోజుకు లేదా వారానికి అద్దె చెల్లించి తెచ్చుకుంటారట.

అలాంటి కరీదైన ఆధునికత కలిగిన ఈ కెమెరాతో ఇండియాలో అత్యంత ప్రతిష్ఠాత్మక సినిమాలలో ఒకటిగా రూపొందుతున్న  ప్రోజెక్ట్ కే సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా ప్రముఖ బాలీవుడ్ భామ దీపికా పదుకునే, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

What do you think?

161 Points
Upvote Downvote

రౌడీ బేబీ స్పెషల్ క్వాలిటీస్ కి అందరూ ఫిదానే

రాజమౌళి దర్శకత్వంలో చిరంజీవి నటించబోతున్నారా….?