in

మసూద సినిమా – రివ్యూ

రివ్యూ

“ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ”,”మళ్ళీ రావా” లాంటి విజయవంతమైన సినిమాలను అందించిన నిర్మాత రాహుల్ యాదవ్ నక్క మరోసారి ప్రేక్షకులను అలరించడానికి తీసుకు వచ్చిన హారర్ థ్రిల్లర్ సినిమా మసూద. ఈ సినిమాలోని కథ ఇప్పటి వరకు వచ్చిన రొటీన్ దెయ్యం కథే అయినప్పటికీ దాన్ని తీర్చిదిద్దిన విధానం,దాని కథనం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కథంతా ముస్లిం నేపథ్యంలో సాగడంతో “మసూద” మామూలు దెయ్యం సినిమాలకు చాలా భిన్నంగా,కొత్తగా ఉంటుంది. ప్రథమార్థంలో సినిమా కొంచెం నెమ్మదిగా సాగినప్పటికీ తరువాత వేగం పుంజుకుని ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సంగీత, తిరువీర్‌, కావ్య, భాందవిలు వారివారి పాత్రలలో ఇమిడిపోవడంతో సినిమా చాలా సహజంగా  ఉంటుంది. సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి అందించిన సంగీతం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చుతుంది. దర్శకుడు సాయికిరణ్ సినిమాను తెరకెక్కించిన విధానం చాలా కొత్తగా ఆసక్తి కలిగిస్తుంది. మొత్తంగా మొదటి నుంచి చివరి వరకు సినిమా చాలా సహజంగా,వినూత్నంగా సాగిపోతుంది.

బలాలు:

  • కథ,కథనం,దర్శకత్వం
  • నటీనటులు
  • సంగీతం

బలహీనతలు:

  • ప్రథమార్థంలో నెమ్మదిగా సాగే కొన్ని సన్నవేశాలు.

చివరిగా: తప్పక చూడాల్సిన సినిమా మసూద

నటీనటులు: సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్ శుభలేఖ సుధాకర్, సత్యం రాజేష్ తదితరులు

దర్శకత్వం: సాయికిరణ్, సంగీతం: ప్రశాంత్ విహారి, కెమెరా: నగేష్ బానెల్, నిర్మాత: రాహుల్ యాదవ్ నక్క.

What do you think?

61 Points
Upvote Downvote

ఘోస్ట్ సినిమా – రివ్యూ

అఖిల్ ఏజెంట్ నాగార్జునకు నచ్చలేదా….?