in

అఖిల్ ఏజెంట్ నాగార్జునకు నచ్చలేదా….?

అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా త్వరలో విడుదల కాబోతుందన్న విషయం అందరికి తెలిసిందే. అయితే నాగార్జునకు ఏజెంట్ అంతగా నచ్చలేదట.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్తో హిట్ కొట్టిన అఖిల్ తో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్. సాక్షి విద్యా,మమ్ముట్టి ప్రధాన పాత్రలు పోషిస్తుండగా,హిఫ్ హాప్ తమీజ్ స్వరాలు అందిస్తున్నారు. బారి అంచనాలతో రాబోతున్న ఈ సినిమా అఖిల్ ను హీరోగా మరో మెట్టు ఎక్కించేది కావడంతో నాగార్జున ఏజెంట్ కు పూర్తి బాధ్యత వహిస్తున్నారట. సినిమా ప్రేక్షకులకు నచ్చేలా ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఏజెంట్ బృందంతో అన్ని వేళలా అందుబాటులో ఉంటూ సూచనలిస్తున్నారట.

ఇటీవలే నాగార్జున ఏజెంట్ సినిమాను వీక్షించారట కానీ సినిమాలోని కొన్ని విషువల్ ఎఫెక్ట్స్ సన్నివేశాలు అంతగా బాగోకపోవడంతో వాటిలో కొన్ని సవరణలు చేయమని ఏజెంట్ బృందానికి సూచనలిచ్చారని సినీ పరిశ్రమలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కారణం వల్లే ఏజెంట్ విడుదల మరింత ఆలస్యమౌతుందని ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. ప్రేక్షకులకు నచ్చే యాక్షన్, కామెడీలతో పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాలతో అలరించే దర్శకుడు సురేందర్ రెడ్డి ఏజెంట్ ను తెరకెక్కిస్తున్నప్పటికీ నాగార్జున అఖిల్ సినిమాను ఎట్టిపరిస్థతుల్లో హిట్ చేయలనే ఉద్దేశంతో మరింత జాగ్రత్తతో ఉంటున్నారట. ఏదేమైనా ఏజెంట్ తో అఖిల్ ఎలా అలరిస్తాడో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.

What do you think?

114 Points
Upvote Downvote

మసూద సినిమా – రివ్యూ

ఆ స్మార్ట్ సిటీలో వానొచ్చెనంటే వరదోచినట్టే….