in

ఆ స్మార్ట్ సిటీలో వానొచ్చెనంటే వరదోచినట్టే….

పెన్షనర్స్ సిటీగా పేరొందిన కాకినాడ పట్టణంలో ఎన్నో నూతన పనులతో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. విద్య, వైద్య, వ్యాపార, వాణిజ్య మెుదలగు రంగాల్లో ఎన్నో మెట్లు ఎదుగుతూ సుందర నగరంగా పేరు తెచ్చుకుంది. కాని ఎన్ని అభివృద్ధి పనులు చేపట్టినప్పటికీ, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంలో అభివృద్ధి సాధించలేకపోయింది. చిన్న వాన కురిసిన రహదారులు నీట మునిగిపోతున్నాయి. ముఖ్యంగా వర్షం వస్తే కాకినాడ నగరంలోని పళ్లంరాజు నగర్, శాంతి నగర్, మహలక్ష్మీ నగర్, సాంబమూర్తి నగర్ మొదలగు ప్రాంతాలు జలమయమయ్యి, రాకపోకలకు ఇబ్బంది అవుతోంది.

చిన్నపాటి వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయిపోతుంటే, ఏ ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం చాలా బాధాకరం!అని అక్కడ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్న వారి పరిస్థితులు మారడం లేదని వాపోతున్నారు. విద్యార్థులు, ఉద్యోగస్తులు ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మునిసిపాలిటీ వారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని డ్రైనేజీ వ్యవస్థను బాగుపరిచే అభివృద్ధి పనులను త్వరగా చేపడితే, స్మార్ట్ సిటీ పేరుకు న్యాయం చేకూరుతుందని కాకినాడ నగర ప్రజల అభిప్రాయం.

What do you think?

32 Points
Upvote Downvote

అఖిల్ ఏజెంట్ నాగార్జునకు నచ్చలేదా….?

ఇకపై ఓ.టి.టిలో విడుదల అసాధ్యమా….?