in

ఇకపై ఓ.టి.టిలో విడుదల అసాధ్యమా….?

కరోనా కాలంలో థియేటర్ల కంటే ఓ.టి.టి లోనే అధిక మొత్తంలో సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో చిన్న సినిమాలతో పాటు పెద్ద హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. అయితే విడుదలైన వాటిలో విజయం సాధించిన వాటికన్నా పరాజయంపాలైన సినిమాలే ఎక్కువ.

తప్పని సందర్భంలో విడుదలైన “ఆకాశమే నీ హద్దుర”,”జై భీమ్” ప్రేక్షకుల ఆదరణ సాధించి భారి విజయ్నాన్ని పొందగా, నాని,సుధీర్ బాబు నటించిన “వి”,నాని హీరోగా నటించిన “టక్ జగదీష్”,అనుష్క నటించిన “నిశబ్దం”,కీర్తి సురేష్ నటించిన “పెంగ్విన్” సినిమాలు అనుకోని విధంగా పరాజయం పాలయ్యాయి. అయినప్పటికీ ఓ.టి.టిల దయవల్ల నిర్మాతలు నష్టాల నుంచి తప్పించుకోగలిగారు. ఆ విధంగా ఇప్పటికీ నేరుగా ఓ.టి.టి లో సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి.

అయితే ఇప్పుడు ఓ.టి.టి సంస్థలు నేరుగా సినిమాలను కొని విడుదల చేయడానికి సంకొచిస్తున్నాయి. ఇకపై సినిమాలను ఓ.టి.టిలో విడుదల చేయాలంటే ముందుగా ఆ సినిమాలను ధియేటర్లలో విడుదల చేయాలని,వాటిపై ప్రేక్షకుల స్పందనను,రివ్యూలు చూసిన తరువాత మాత్రమే సినిమాలను తీసుకునే ఆలోచన చేస్తామని ఓ.టి.టి సంస్థలు చెబుతున్నాయి. అయినప్పటికీ సినిమాను నేరుగా ఓ.టి.టి లో విడుదల చేయాలనుకునే వారికి సవాలక్ష  కండీషన్లు పెడుతూ,వారు అంగీకరించలేని మొత్తం సినిమా కొనుగోలు కరీదుగా చెప్పి నిర్మాతలను ఇబ్బంది పెట్టే ఆలోచనలో ఉన్నట్టు టాక్, ఇటువంటి పరిస్థితుల్లో నేరుగా ఓ.టి.టి లో రిలీజ్ కష్టమే…

What do you think?

52 Points
Upvote Downvote

ఆ స్మార్ట్ సిటీలో వానొచ్చెనంటే వరదోచినట్టే….

కాంగ్రెస్ లో గులాంనబీ రాజీనామాకు అసలు ‘కారణం’?