in ,

టాప్ 5 హాట్ స్టార్ సీరిస్లు #పార్ట్ 2…

టాప్ 5 హాట్ స్టార్ సీరిస్లు 

 

1.స్కెచ్

యాక్షన్ క్రైం ఫాంటసీగా తెరకెక్కిన కోరియన్ డ్రామా సీరీస్ స్కెచ్. ఈ సీరీస్లోని ప్రతి క్షణం ఏం జరుగుతుందో.. అనే ఉత్కంఠతో భావోద్వగబరితంగా సాగిపోతుంది. కొరియన్ డ్రామాస్ ఇష్టపడేవరికి బాగా నచ్చుతుంది.

 

2..వాండా విజన్

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో బాగంగా తెరకెక్కిన మరో సీరీస్ వాండా విజన్. ఈ సీరీస్ మొదట్లో బ్లాక్ అండ్ వైట్లో ఉన్నపటికీ ఆ తరువాత వినోదం పంచుతూ,అసక్తికరంగా మారుతుంది. దీని తరువాత మార్వెల్లో వచ్చిన సినిమాలకు ఇది పునాదిగా మారి ముందుకు సాగే కథను కల్పించడంతో పాటు ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది.

 

3. 9 హౌర్స్

సర్వైవల్ క్రైం థ్రిల్లర్ హైస్ట్ డ్రామాగా తెరకెక్కిన సీరీస్ 9 హౌర్స్. ఈ సీరీస్ విభిన్నమైన కథతో,ఆసక్తికరమైన సన్నివేశాలతో ప్రేక్షకులను అలరిస్తూ సాగిపోతుంది. దర్శకుడు నిరంజన్ కౌశిక్ ఈ సీరీస్ను తెరకెక్కించగా,తారక్ పాట్నా,మధు షాలిని,ప్రీతి ఆశ్రని,అంకిత్ కొయ్య,రవి వర్మ,జ్వాలా కోటి ప్రథాన పాత్రలలో నటించారు.

 

4.మాసూమ్

థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సీరీస్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. చివరి వరకు సినిమాలోని తీవ్రతను నిలుపుకుంటూ ఆసక్తికరంగా సాగిపోతుంది. సీజన్ 1గా విడుదలైన ఈ సీరీస్ లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉండగా ఒక్కొకటి 30 నిమిషాల నిడివి కలిగి ఉంటాయి.బొమ్మన్ ఇరానీ,ఉపాసన సింగ్,సమర తిజోరి, వీర్ రజవంత్ సింగ్,
మను రిషి చద్ద ప్రధాన పాత్రలలో కనిపించగా,దర్శకుడు మిహిర్ దేశాయ్ తెరకెక్కించారు.

 

5.నవంబర్ స్టొరీ.

క్రైం డ్రామాగా తెరకెక్కిన ఈ సీరీస్ ప్రతి క్షణం ఉత్కంటబరితంగా ఉంటూ ప్రేక్షకులను కట్టిపడేసింది.దీనిలో మొత్తం 7 ఎపిసోడ్స్ ఉండగా ప్రతి ఎపిసోడ్ 30 నుంచి 40 నిమిషాల నిడివి కలిగి ఉంటుంది. ఈ సీరీస్ లో తమన్నా,జీ.ఎమ్.కుమార్,పసుపతి,నమిత కృష్ణమూర్తి ప్రధాన పాత్రాలలో నటించగా,దర్శకుడు ఇంద్రా సుబ్రహ్మణ్యున్ తెరకెక్కించాడు.

What do you think?

టాప్ 5 మూవీస్ ఆఫ్ సోనీలివ్ #పార్ట్ 2

అలరించే తెలుగు వెబ్ సీరీస్లు….!