వెండి తెరపై కనిపించే సినీతారలు టీవీ గేమ్ షోలకు, రియాలిటీ షోలకు హోస్ట్ గా వ్యవహరించడం,అతిథిగా వచ్చి అలరించటం అందరికి తెలిసిన విషయమే. అయితే ఓ.టి.టి ప్లాట్ ఫామ్లకు ప్రేక్షకులలో వస్తున్న ఆదరణను చూసి వాటిలో కనిపించడానికి సినీతారలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే సమంత, ప్రియమణి, తమన్నా, కాజల్ వంటి కథానాయికలు కనిపించగా, తాజాగా అగ్రకథానాయకులు కూడా ఓ.టి.టిపై కనిపించబోతున్నారు.
1.దూత
తీసినా ప్రతి సినిమా క్యారెక్టర్లోను,కథలోనూ కొత్తధనం ఉండేలా చూసుకునే నటుడు అక్కినేని నాగ చైతన్య ఇప్పుడు దూత వెబ్ సిరీస్తో ఓ.టి.టిలోకి తొలిసారిగా అడుగుపెడుతున్నాడు.”లవ్ స్టొరీ”,”బంగార్రాజు” సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం అందుకుని,”థాంక్యూ”తో పరాజయాన్ని చూసిన నాగచైతన్య ఇప్పుడు హార్రర్ థ్రిల్లర్ జోనర్ “దూత” వెబ్ సిరీస్తో ప్రేక్షకులను,అభిమానులను ఓ.టి.టిలో అలరించబోతున్నాడు. “దూత” వెబ్ సిరీస్ ను ప్రముఖ దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కించగా త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబోతుంది.
2.రానా నాయుడు
బాహుబలి బళ్ళాల దేవుడు రానా దగ్గుబాటి,విక్టరీ వెంకటేష్ తొలిసారి కలిసి నటించిన వెబ్ సిరీస “రానా నాయుడు”. రానా దగ్గుబాటి,విక్టరీ వెంకటేష్ ఇప్పటివరకు ఏ సినిమాలో కలిసి నటించలేదు. తొలిసారి బాబాయ్-అబ్బాయిలు కలిసి నటించబోతున్నారు. “రానా నాయుడు” వెబ్ సిరీస్ అమెరికన్ క్రైం డ్రామా “రే డోనోవన్”కు ఆధారితంగా తెరక్కెకించబడింది. “రానా నాయుడు “వెబ్ సిరీస్ని కరణ్ అనుష్మాన్, సుపర్న్ వర్మ తెరకెక్కించారు.”రానా నాయుడు” నెట్ఫిలిక్స్ ఓ.టి.టి ప్లాట్ఫామ్ లో విడుదల కాబోతుంది.
చిన్న హీరోలు సైతం అగ్రకథానాయకుల బాటలో నడుస్తున్నారు. సుశాంత్ “మా నీళ్ళ టాంక్” వెబ్ సిరీస్తో ఓ.టి.టి లోకి అడుగుపెట్టి పర్లేదనిపించుకోగా,రాజ్ తరుణ్ కూడా “అహనా పెళ్ళంట” వెబ్ సిరీస్తో వచ్చి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక నాగ చైతన్య,రానా,వెంకటేష్ సిరీస్లు ఏ విధంగా మెప్పిస్తాయో చూడాలి.