in ,

32గంటల్లో 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్

32 గంటల్లో 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్

విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘బేబీ’ సినిమా ఏ స్థాయి విజయం అందుకుందో తెలిసిన విషయమే. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అయితే తాజాగా ఓటీటీలో విడుదలైన తరువాత కూడా అదే ఫామ్ కొనసాగిస్తూ దుమ్ము రేపుతోంది.

ఆగస్ట్ 25న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ‘బేబీ’ సినిమా విడుదలైంది. కాగా స్ట్రీమింగ్ మొదలైన 32 గంటల్లోనే దాదాపు 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ తో ఈ సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కూడా తాజాగా ఓ పోస్టర్ విడుదల చేసింది. ఓటీటీలోనూ ‘బేబీ’ బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించిందని పేర్కొంది.

ఈ విషయం తెలిసిన ఆనంద్ దేవరకొండ తన సంతోషాన్ని ఇన్స్టా గ్రామ్ (instagram) ద్వారా వ్యక్తం చేశారు.

What do you think?

ఏఐ రేసులో మెటా.. చాట్ జీపీటీకి దీటుగా కోడ్ లామా

ఇక నుంచి ట్విట్టర్‌ లో కూడా ఉద్యోగాల వేట.. ట్విట్టర్‌ కొత్త ఫీచర్