in ,

2022 టాప్ 5 నెట్‌ఫ్లిక్స్ సిరీస్లు #పార్ట్ 1

2022 టాప్ 5 నెట్‌ఫ్లిక్స్ సిరీస్లు

1. ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్ (కొరియన్): జోంబీ అపోకలిప్స్ హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా మంచి హిట్ అయింది. సీజన్ 1 బిగ్గెస్ట్ హిట్ అవ్వడం తో సీజన్ 2 ఎప్పుడెప్పుడా అని అంత ఎదురుచూస్తున్నారు.మోస్ట్ నెంబర్ ఆఫ్ స్ట్రీమింగ్స్ తో టాప్ 2022 నెట్‌ఫ్లిక్స్ లో మొదటి స్థానం లో ఉంది.

2. స్ట్రేంజర్ థింగ్స్ : స్ట్రేంజర్ థింగ్స్, డఫర్ బ్రదర్స్ రూపొందించిన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ హారర్ డ్రామా టెలివిజన్ సిరీస్. దీని మొదటి సీజన్ నెట్‌ఫ్లిక్స్‌లో 2016 లో విడుదలైంది. ఇప్పటివరుకు మొత్తం నాలుగు సీజన్స్ రిలీజ్ అయ్యి బిగ్ హిట్ అయ్యాయి సిరీస్ ఐదవ మరియు చివరి సీజన్ కోసం వెబ్ సిరీస్ లవర్స్ అంత వెయిట్ చేస్తున్నారు.

3.బిజినెస్ ప్రపోసల్(కొరియన్): బిజినెస్ ప్రపోసల్ అదే టైటిల్‌తో కూడిన వెబ్‌టూన్ ఆధారంగా రూపొందించిన ఒక దక్షిణ కొరియా రొమాంటిక్ కామెడీ టెలివిజన్ సిరీస్. కొరియన్ వెబ్ సిరీస్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. గుడ్ నెంబర్ ఆఫ్ స్ట్రీమింగ్స్ తో నెట్‌ఫ్లిక్స్ టాప్ 2022లో 3వ స్థానం దక్కించుకుంది.

4.మని హెయిస్ట్:(స్పానిష్ లా కాస్ దే పాపల్) అలెక్స్ పినా రూపొందించిన స్పానిష్ హీస్ట్ క్రైమ్ డ్రామా టెలివిజన్ సిరీస్.సాధారణ వెబ్ సిరీస్ గా వచ్చి ఊహించని క్రేజ్ మరియు అభిమానులను సంపాదించుకున్న మనీ హెయిస్ట్ మొత్తం 5 సీజన్స్ బిగ్గెస్ట్ హిట్ అయ్యి 2022 టాప్ వెబ్ సిరీస్ లో 4 పొజిషన్ దక్కించుకుంది.

5. స్క్విడ్ గేమ్ (కొరియన్): ఇది కొరియన్ సర్వైవల్ డ్రామా టెలివిజన్ సిరీస్. 2021 లో రిలీజ్ అయినా సీజన్ 1 బిగ్గెస్ట్ హిట్ అవ్వడమే కాక, సెకండ్ సీజన్ కోసం ఆతృత గా ఎదురు చూసేలా చేసింది. నెట్‌ఫ్లిక్స్ లో అత్యధికంగా వీక్షించిన ఈ సిరీస్ టాప్ వెబ్ సిరీస్ 2022 లో 5వ స్థానం దక్కించుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్ళకి ఇది బాగా నచుతుంది.

What do you think?

ప్రైమ్ వీడియోలోని టాప్ 5 సినిమాలు # పార్ట్ 1

ఆహా అనిపించే 5 ఉత్తమ ఆహా సినిమాలు #పార్ట్ 1