in

రవితేజ “ధమాకా” ఓఓటి విడుదలపైనే అందరి కళ్ళు…!

క్రాక్ సినిమాతో గత ఏడాది హిట్ కొట్టిన రవితేజ ఆ తరువాత వచ్చిన ఖిలాడి,రామా రావు ఆన్ డ్యూటీ సినిమాలు బాక్స్ ఆఫీస్ ముందు చతికిల బడడంతో మళ్ళీ ఫ్లాప్ల బాట పట్టాడని అందరూ అనుకున్నారు.కానీ ఆ అపోహలను కొట్టి వేస్తూ “ధమాకా” సినిమాతో హిట్ కొట్టాడు.దీనికి తోడు రవితేజ ముఖ్య పాత్రలో కనిపించిన చిరంజీవి “వాల్తేరు వీరయ్య” సినిమా కూడా మంచి విజయాన్ని దక్కించుకుంది.దీంతో “ధమాకా” ఓఓటి విడుదలపైనే అందరి కళ్ళు పడ్డాయి.
గత ఏడాదిలో గ్లోబల్ గా దాదాపుగా 2.4 మిలియన్ల సబ్స్క్రైబర్లను(subscribers) సొంత చేసుకున్న, ప్రపంచంలోనే అతి పెద్ద ఓఓటి ప్లాట్ ఫామ్ లలో ఒకటైన నెట్ఫ్లిక్(Netflix) లో జనవరి 22న ఈ సినిమా విడుదల కాబోతుందని తెలుస్తుంది.
త్రినాధ్ రావు నక్కిన దర్సకత్వంలో రవితేజ,శ్రీలీలా హీరో హీరోయిన్లుగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ “ధమాకా”.
జయరామ్,రావు రమేష్,తులసి,తనికల బరణి ప్రధాన పాత్రలు పోషించగా.. భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చారు.కాశ్మీర్ ఫైల్స్,కార్తికేయ 2 సినిమాలను అందించిన అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించారు.

What do you think?

154 Points
Upvote Downvote

బాధలలోనే సంతోషం వెతుకున్న సిల్క్ స్మిత.

ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన జైలు జీవితం…?