in

ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన జైలు జీవితం…?

ఒక రోజు జైలు శిక్ష ఒక నింధితుడి జీవితాన్నే మార్చేసింది.అతనికి ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది.అసలు ఆ నింధితుడు ఎవరు?అతని జీవితాన్ని మార్చేసిన విషయం ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే ఈ స్టోరీ మీద ఒక లుక్ వేయాల్సిందే..
బీహార్లో మద్యపాన నిషేధం అమలులో ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇటీవల బీహార్లోని కైమూర్ దహ్రాక్ గ్రామానికి చెందిన కన్హయ్యరాజ్తాగి మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణ కారణంగా అరెస్ట్ అయ్యాడు.
అయితే ఆ రాత్రి జైలులో ఉండి మరుసటి రోజు ఉదయం విడుదలై బయటకు వచ్చిన కన్హయ్య అతని పాట ఫేమస్ అయ్యిందని వాట్సాప్ లో చక్కర్లు కొడుతోందని అతని స్నేహితులు చెప్పడంతో సోషల్ మీడియాలో తన గొంతు విని ఎంతో సంతోషించాడు.
తను అసలు జైలుకి ఎందుకు వెళ్ళాడన్న విషయాన్ని చెప్పాడు.కన్హయ్యరాజ్ ని మద్యం తాగినందుకు పోలీసులు అరెస్ట్ చేయలేదని, పవన్ సింగ్ (భోజ్పురి హీరో) పాట పాడినందుకు..అతను పాడిన పాటలో ఒక పదం అభ్యంతకరంగా ఉందని ఆ హీరో ఫ్యాన్ ఫిర్యాదు చేసినందుకు అతన్ని అరెస్ట్ చేశారని కన్హయ్య తెలిపాడు.కానీ తను పాడిన పాట వీడియోని కన్హయ్యరాజ్ అప్పుడే డిలీట్ చేశానని వివరించాడు.ఇక ఆ రాత్రి జైల్లో గడిపిన తను సరదాగా పాట పాడానని,అది ఎవరు వీడియో తీసి ఇలా పోస్ట్ చేశారో తనకు తెలియదని చెప్పుకొచ్చాడు.
ఆర్థిక ఇబ్బందులతో చిన్నతనంలోనే చదువుకు దూరం అయ్యానని, రిపబ్లిక్, ఇతర ఫంక్షన్లకు పాటలు కూడా పాడతానని చెప్పాడు కన్హయ్య. ఇక జైలు వీడియో వైరల్ కావడంతో బాలీవుడ్ సింగర్ కమ్ మ్యూజిక్ కంపోజర్ అంకిత్ తివారీ తన మ్యూజిక్ ఆల్బమ్లో పాడేందుకు కన్హయ్యకు అవకాశం ఇస్తానని ప్రకటించగా.. మరోవైపు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి మట్టిలో మాణిక్యాలకు సహాయ పడి వారి టాలెంట్ ను ప్రపంచానికి తెలియ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.అదే విధంగా అతని కుటుంబానికి అవసరమయ్యే సాయం కూడా అందిస్తామని ప్రకటించారు.
అతని విడియోను పోస్ట్ చేసి తన ప్రతిభను ప్రపంచానికి తెలిసేలా చేసిన వారికి కన్హయ్య కన్నీళ్ళతో కృతజ్ఞతలు తెలిపాడు.తనకి వచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుని తన కుటుంబ భవిష్యత్ ని తీర్చి దిద్దుకుంటానని అన్నాడు.

What do you think?

118 Points
Upvote Downvote

రవితేజ “ధమాకా” ఓఓటి విడుదలపైనే అందరి కళ్ళు…!

వారసత్వానికి వ్యాపార బాధ్యతలు అప్పగించబోతున్న బెర్నార్డ్ ఆర్నాల్ట్.ఇక ఆయన కంపెనీ బాధ్యతంతా ఆమెదే.