ఈ ఏడాది ఆసక్తికరమైన సినిమాలు,సీరీస్లు ఓ.టి.టిలలో ఎన్నో విడుదలయ్యాయి. అలాంటి వినోదాన్ని పంచే జీ5 లోని టాప్ 5 సినిమాలు,సీరీస్లు మీ కోసం.
- కాశ్మీర్ ఫైల్స్ (The Kashmir Files)
కాశ్మీర్లో జరిగిన యధార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని కల్పిత కథతో తెరకెక్కించిన చిత్రం కాశ్మీర్ ఫైల్స్. ఈ చిత్రం భావోద్వేగబరితమైన సన్నివేశాలతో పాటు, ఉత్కంఠ కలిగించే విధంగా ఉంటుంది. అత్యంత వివాదాస్పదమైన ఈ చిత్రాన్ని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించగా,మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి,చిన్మయ్ మాండ్లేకర్, మృణాల్ కులకర్ణి ప్రధాన పాత్రలు పోషించారు
- విక్రాంత్ రోన (Vikrant Rona)
కన్నడ హీరో కిచ్చా సుదీప్ నటించిన అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ విక్రాంత్ రోన. విభిన్నమైన కథతో,ఆసక్తి రేకెత్తించే సన్ని వేసాలతో ప్రేక్షకులను అలరిస్తుంది ఈ చిత్రం. దర్శకుడు అనూప్ బందేరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
- కోడ్ ఎమ్ (Code M)
మిస్టరీ డ్రామాగా తెరకెక్కిన సీరీస్ కోడ్ ఎమ్. ఈ సీరీస్ లో మొదటి సీజన్ 2020లో రాగా దానికి కొనసాగింపుగా సీజన్-2 2022లో విడుదలైంది. ఈ సీరీస్ లో రెండు సీజన్స్ లకు గాను 16 ఎపిసోడ్స్ ఉండగా మొదటి నుంచి చివరి వరకు ఆసక్తికరంగా సాగిపోతుంది. జెన్నిఫర్ వింజెట్,తనూజ విర్వని,అలేక్ కపూర్,మేఘన కౌశిక్,రజట్ కపూర్,కేశవ్ సద్నా ప్రథాన పాత్రలలో నటించారు. దర్శకుడు అక్షయ్ చౌబే ఈ సీరీస్ ను తెరకెక్కించారు.
4.కుధా అఫిజ్ చాప్టర్ -2 (Khuda Haafiz-2)
కుధా అఫిజ్ చాప్టర్ 1 కు సీక్వెల్ గా యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం కుధా అఫిజ్ చాప్టర్ -2 అగ్ని పరీక్ష. బలమైన కథతో వెంట్రుకలు నిక్కబొడిచే సన్ని వేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ చిత్రం. ఫరూక్ కభీర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, విద్యుత్ జమాల్,మేనకా రాయి,ప్రధాన పాత్రలు పోషించారు.
5.ది బాడ్ గైస్ (The Bad Guys)
అమెరికన్ యానిమేటెడ్ కామెడీగా తెరకెక్కిన చిత్రం ది బాడ్ గైస్. చిన్న పిల్లలతో పాటు పెద్ద వాళ్ళు కూడా చూసి కడుపుబ్బ నవ్వుకునే చిత్రం ఇది. బలమైన కథతో పాటు ఈ చిత్రంలోని సంగీతం సన్నివేశానికి తగ్గట్టుగా ఉంటూ ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచుతుంది.