in

2022 టాప్ 5 ఆహా సినిమాలు,సీరీస్లు పార్ట్ 1

ఇటీవలే కాలంలో ప్రేక్షకులని అలరించే సినిమాలు ఓ.టి.టి ప్లాట్ ఫామ్ లలో చాలానే విడుదలైయాయి.అలాంటి ఆహా అనిపించే అహాలోని కొన్ని సినిమాలు,సీరీస్ లు మీకోసం

1.మహా (Maha)

క్రైం ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా లేడీ ఓరియంటెడ్ గా తెరకెక్కిన మహా తనదైన కొత్త ధనంతో ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఇప్పటి వరకు విడుదలైన క్రైం థ్రిల్లర్లకు బిన్నంగా ఉంటూ ఎక్కడ బోర్ కొట్టకుండా సాగిపోతుంది.ఈ  సినిమాలో హన్సిక మోత్వని ప్రధాన పాత్ర పోషించగా,హీరో శింబు అతిధి పాత్రలో ఉన్న కొది సేపు తన పాత్రకు న్యాయం చేశాడు.

  1. హైవే (Highway)

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ పుష్పక విమానం తరువాత హైవే అంటూ మరొక సారి వచ్చేశాడు. సైకో క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన హైవే మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను అలరిస్తూ సాగిపోతుంది. కేవీ గుహన్‌ దర్శకత్వం వహించారు.

3.అశోక వనంలో అర్జున కళ్యాణం

వరుస సినిమాలతో అధరగొడుతున్న విశ్వక్ సేన్ ప్రేక్షకులను అలరించడంలో వెనకడుగువేయనని అశోక వనంలో అర్జున కళ్యాణంతో ఇంకొకసారి నిరూపించుకున్నాడు. రోమ్- కామ్ గా తెరకెక్కిన ఈ సినిమా అందర్నీ ఆలోచింప చేస్తూ,కడుపుబ్బ నవ్విస్తుంది.

4.#బి.యఫ్.యఫ్ (#BFF)

ఇటీవలే కాలంలో తెలుగులో కూడా మంచి సీరీస్ లు విడుదలవుతున్నాయి. అలా వచ్చిన తెలుగు సీరీస్ #బి.యఫ్.యఫ్. కామెడీ – డ్రామా గా తెరకెక్కిన ఈ సీరీస్ అందరికి ఎమోషనల్ గా కనెక్ట్  అవుతుంది.

  1. అన్యాస్ ట్యుటోరియల్ (Anya’s Tutorial)

హార్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన అన్యాస్ ట్యుటోరియల్ సీరీస్ మొదలైన దగ్గర నుంచి చివరి వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని  పంచుతుంది. దీంట్లో మొత్తం 7 ఎపిసోడ్స్ ఉండగా ఒక్కొకటి  సుమారు 30 నిమిషాల నిడివి కలిగి ఉంటాయి.పల్లవి గంగిరెడ్డి ఈ సీరీస్ ను తెరకెక్కించగా,నివేదితా సతీష్, రెజీనా ప్రధాన పాత్రలలో కనిపించారు.

What do you think?

211 Points
Upvote Downvote

29 మంది టెక్నిషన్స్ ని హతమార్చిన రోబోట్స్…ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ తో మానవాళికి ముప్పు???

2022 టాప్ 5 జీ5 సినిమాలు,సీరీస్లు #పార్ట్ 1