in

29 మంది టెక్నిషన్స్ ని హతమార్చిన రోబోట్స్…ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ తో మానవాళికి ముప్పు???

ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI)! మన వాడుక భాషలో చెప్పాలంటే మనుషులతో సహా జంతువులు ప్రదర్శించే సహజ మేధస్సుకు విరుద్ధంగా యంత్రాల ద్వారా ప్రదర్శించబడే మేధస్సు. యంత్రం యొక్క నిర్దిష్ట లక్ష్యాలను అర్ధం చేసుకొని వాటిని సాధించడమే ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్. శాస్త్రవేత్తలు తాము సృష్టించిన ఈ మేధస్సు ద్వారా ఎన్నో రోబోట్స్ ని తయారు చేసి వివిధ శాఖల్లో వాటిని ఉపయోగించి గొప్ప విజయాన్ని సాధించారు. మనిషి తన శారీరక శక్తికి బదులుగా యంత్రాలని వాడటం ద్వారా ప్రాణాంతకమైన పరిస్థితిలో ప్రాణహాని లేకుండ జాగ్రత్త పడొచ్చు అని శాస్త్రవేత్తల అంచనా.

ఈ ఆలోచన తోనే 2018 లో జపాన్ కి చెందిన ఒక రోబోటిక్స్ కంపెనీ మిలిటరీ పవర్ కోసం రోబోట్స్ ని తయారుచేసి శోధనలో భాగంగా వాటిని పరీక్షిస్తుండగా 4 రోబోట్స్ టెక్నిషన్స్ పైన మెటల్ బుల్లెట్స్ తో దాడి చేసి 29 టెక్నిషన్స్ ని హతమార్చాయి. ల్యాబ్ లో ఉన్న మిగిలిన టెక్నిషన్స్ అప్రమత్తమై 2 రోబోట్స్ ని డియాక్టివేట్ చేసి 3వ రోబోట్ ని డియాక్టివేట్ చేసే ప్రయత్నంలో ఉండగా 4వ రోబోట్ ఆర్బిటింగ్ సెటిలైట్ కి కనెక్ట్ అయ్యి మునపటి కంటే రెట్టింపు శక్తి తో తనని తాను రీబిల్డ్ చేసుకోడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని డౌన్లోడ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది.

మానవుని సృష్టి మనిషి జీవితానికి ముప్పులా మారింది.”ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ మానవాళికి ముప్పేనని అణు బాంబుల కంటే AI చాలా ప్రమాదకరమైనది” అని ప్రముఖ అమెరికన్ బిజినెస్ మాగ్నట్, స్పేస్ x అధినేత ‘ఎలన్ మస్క్’ హెచ్చరించారు. అయితే, తన మేధాశక్తి తో ప్రపంచాన్ని అబ్బుర పరిచిన బ్రిటన్‌ ప్రముఖ శాస్త్రవేత్తలలో ఒకరైన ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్ “ఆలోచించగలిగే యంత్రాలను రూపొందించే ప్రయత్నాలు మన ఉనికికే ముప్పు కలిగిస్తాయని అది తనని తాను అదుపులోకి తీసుకొని ఎప్పటికప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ ద్వార తిరిగి రూపకల్పన చేస్తుంది” అని గతం లోనే హెచ్చరించారు.

What do you think?

361 Points
Upvote Downvote

15 కిలోమీటర్లు ట్రైన్ కిటికీ బయట వ్రేలాడుతూ…! ఫోన్ కోసం ప్రాణం మీదకు తెచ్చుకున్న దొంగ…

2022 టాప్ 5 ఆహా సినిమాలు,సీరీస్లు పార్ట్ 1