in ,

ఇకపై రియల్ టైమ్ సమాచారం అందించనున్న చాట్ జీపీటీ

ఇకపై రియల్ టైమ్ సమాచారం అందించనున్న చాట్ జీపీటీ

చాట్ జీపీటీ (chat gpt) యూజర్లకు ఓపెన్ ఏఐ (open ai) శుభవార్త చెప్పింది. ఇక నుంచి యూజర్లు రియల్ టైమ్ సమాచారం పొందవచ్చని తెలిపింది.

ప్రస్తుతం చాట్ జీపీటీ యూజర్లకు 2021 వరకు సమచారాన్ని మాత్రమే అందిస్తుంది. దీని వల్ల ఆ ఏడాది వరకు ఎంత సమాచారం అయితే అందుబాటులో ఉందో అంత వరకు మాత్రమే యూజర్లకు అందించగలిగేది. దీని వల్ల కొన్ని సార్లు రియల్ టైం సమాచారానికి చాట్ జీపీటీ అందించే సమాచారానికి వత్యాసం ఉండేది.

ఇప్పుడు ఈ ప్రాబ్లెమ్ ని సాల్వ్ చేస్తూ చాట్ జీపీటీ (chat gpt) పేరెంట్ కంపనీ ఓపెన్ ఏఐ (open ai) శుభవార్త చెప్పింది. ఇక నుంచి చాట్ జీపీటీ రియల్ టైమ్ సంచారాన్ని అందిస్తుందని తెలిపింది.

అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ ను చాట్‌జీపీటీ ప్లస్‌, చాట్‌జీపీటీ ఎంటర్‌ ప్రైజెస్‌ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా అతి త్వరలోనే నాన్‌ సబ్‌స్క్రైబర్లకు కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఓపెన్‌ఏఐ పేర్కొంది.

What do you think?

భోజనంలో బల్లి. 110 విద్యార్థులకు అస్వస్థత

ఆసియా గేమ్స్‌లో భారత్‌ కు మరో రెండు స్వర్ణాలు