in ,

ఉక్రెయిన్ తో యుద్దం వల్ల రష్యా నష్టపోతుందా?పుతిన్ మాటలు బడాయి కబుర్లేనా?

ఉక్రెయిన్ కి రష్యాకి మధ్య ఏడాది కాలంగా యుద్దం జరుగుతూ వస్తుంది.అయితే ఈ యుద్ధంలో ఉక్రెయిన్ బాగా నష్టపోతుందని ఇప్పటి వరకు వివిధ రకాలుగా మాటలు వినపడగా.. ఇప్పుడు ఈ యుద్దం వల్ల రష్యానే ఎక్కువగా నష్టపోతుందని,ఇదే కొనసాగితే ఆ దేశం నాశనం అయ్యే అవకాశం కూడా ఉందని ఇటీవల ఒక సర్వే ద్వారా తేలింది.
వివరాల్లోకి వెళ్తే గ్లోబల్ స్ట్రాటజిస్ట్(Global strategist) అండ్ అనలిస్ట్ చేసిన ఒక సర్వేలో రష్యా అంతర్జాతీయ సమాజం ముందు “ఓ ఫెయిల్యూర్ నేషన్” గా నిలబడాల్సి వస్తుందని తెలిసింది.రాబోయే పదేళ్లలో అంటే 2033 సంవత్సరం కల్లా రష్యా పతనం తప్పదని దాదాపు 46% మంది ఓటు వేసినట్టుగా అంట్లాంటిక్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన సర్వే ద్వారా వెల్లడైంది.ఈ యుద్ధం కారణంగా పోయిన ఏడాదితో పోల్చి చూస్తే ఉక్రెయిన్ 30% మేర పతనం అయ్యినట్టు తేలింది.
అయితే ప్రతి ఏడాది జనవరి 6,7 తేదీలలో ఉక్రెయిన్,మరియు రష్యా ఇరు దేశాలలో క్రిస్టియన్లు క్రిస్మస్ జరుపుకుంటారు.ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ జనవరి 6న 12 గంటల పాటు ఉక్రెయిన్ పై ఎవరూ దాడి చేయవద్దని చెప్పారని రష్యా ప్రతినిధులు చెప్పారు.ఆర్థోడాక్స్ చర్చ్ హెడ్ విజ్ఞప్తి మేరకు పుతిన్ ఈ సూచనలు ఇచ్చారని తెలిపారు.అయితే ఉక్రెయిన్ పై మరింత సైన్యాన్ని మోహరింపచేయడానికే ఈ విరామాన్ని తీసుకున్నారని,ఈ ప్రకటన చేయడంలో పుతిన్ సానుభూతి ఏమీ లేదని జలన్స్కీ ఆరోపించారు.
తూర్పు డాన్బాస్ ప్రాంతంలో తమ ఆధిపత్యాన్ని అణిచేందుకు అదనపు బలగాలు, ఆయుధాలు సమకూర్చుకుంటున్నారని,దీన్ని కాల్పుల విరమణ అని కవర్ చేస్తున్నారని విమర్శించారు.
ఈ పై పై సానుభూతి వల్ల కలిగే ప్రయోజనమేమీ లేదని, మళ్లీ రష్యా దాడులు కొనసాగుతాయని,ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారని అసహనం వ్యక్తం చేశారు.పుతిన్ చెప్పే మాటలను నమ్మలేమని జలన్స్కీ మండిపడ్డారు.
ఇప్పటికే 50 వేల మంది సైనికులను యుద్ధ రంగంలో మొహరించినట్టు పుతిన్ ప్రకటించారు.ఇంకో రెండున్నర లక్షల మందిని సిద్ధం చేసి ఎప్పుడైనా ఉక్రెయిన్ను ఆక్రమిస్తామని సంకేతాలిస్తున్నారు.
అయితే అక్కడ ప్రస్తుతం శీతాకాలం కావడంతో రష్యన్ సైనికులు చలి కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్న వార్తలు వస్తుండగా.. యుద్ధరీతిలో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

What do you think?

179 Points
Upvote Downvote

నిర్లక్ష్యమైన డ్రైవింగ్ తో ప్రాణాలు తీయబోయిన 25 ఏళ్ల బెంగుళూరు యువకుడు.

డ్రెస్ కోడ్ లేకపోతే… దేవుడి దర్శనం కూడా లేదా?