in ,

గ్యాస్ స్టవులను అమెరికాలో నిషేదించబోతున్నారా?సీపీఎస్సీ ఇచ్చిన ప్రకటనతో ప్రజలు ఏకీ భావిస్తారా?

గ్యాస్ స్టవుల వల్ల పర్యావరణానికి,ఆరోగ్యానికి గండం పొంచి ఉందని,వెంటనే వీటిని నిషేధించాలని అమెరికా యోచిస్తున్నట్టు వినియోగదారుల రక్షణ కమీషన్ (సీపీఎస్సీ) ఇటీవల ఒక నివేదికలో ప్రకటించింది.దీంతో అమెరికా వ్యాప్తంగా ప్రజలలో ఆందోళన మొదలైంది.
ఈ ఆందోళనకు తోడు ఇది కొద్ది కొద్దిగా రాజకీయ రంగు పులుముకుంటూ డెమొక్రాట్,రిపబ్లికన్ రాజకీయ యుద్ధంగా మారుతుంది.ఈ సమస్యతో అమెరికన్ పార్లమెంట్ సభ్యులు మధ్య సామాజిక మాధ్యమాల్లో మాటల తూటాల దాడికి దారి తీసింది.
వివరాల్లోకి వెళ్తే హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్,పర్యావరణ పరిశోధన,ప్రజారోగ్యంపై ఇంటర్నేషనల్ జర్నల్లలో గ్యాస్టవ్లపై ఓ నివేదిక కూడా ప్రచురితమైంది.ఈ ప్రచురణలో వంటకు వాడుతున్న గ్యాస్టవ్ల నుంచి నైట్రోజన్ డయాక్సైడ్,కార్బన్ మోనాక్సైడ్లతో పాటు పీఎం 2.5 అనే సూక్ష్మ రేణువులు విడుదలవుతాయి.ఇవి
పర్యావరణానికి హాని చేసేవేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.ఈ నైట్రోజన్ డయాక్సైడ్, పీఎం 2.5 లు రెండూ ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తాయని,చిన్నపిల్లల్లో ఆస్తమాకు నైట్రోజన్ డయాక్సైడ్ కారణమవుతుందిని వాళ్ళు అన్నారు.సరైన గాలి వెలుతురు లేని చోట ఈ వాయువులు ఆస్తమానే కాకుండా క్యాన్సర్,గుండె సంబంధిత తీవ్ర అనారోగ్య సమస్యలకూ కారణం అవ్వొచ్చని వివరించారు.
“ఒక్క 2019లోనే ప్రపంచవ్యాప్తంగా నైట్రోజన్ డయాక్సైడ్ కాలుష్యం కారణంగా 20 లక్షలమంది పిల్లల్లో ఆస్తమాను గుర్తించారు.వంటకు గ్యాస్టవ్లను ఎక్కువగా వాడుతున్న ఇళ్లలో పిల్లలకు ఆస్తమా వచ్చే అవకాశం 42శాతం ఎక్కువ.అమెరికాలో తాజా ఆస్తమా కేసుల్లో 12శాతం ఈ గ్యాస్టవ్ల ప్రభావితాలే.50 ఏళ్ల పరిశోధనల ప్రకారం పర్యావరణానికి,ఆరోగ్యానికి గ్యాస్టవ్లు హానికారకాలని తేలుతోంది” అంటూ చెప్పుకొచ్చారు.
కాగా ఈ వివరాలు బయటకు రాగానే అమెరికా సీపీఎస్సీ
స్పందించింది.గ్యాస్టవ్లతో గండం పొంచి ఉందిని,ప్రజల భద్రతకు ముప్పుగా పరిణమించేవాటిని నిషేధిస్తామని అన్నారు.గ్యాస్టవ్లపై నిషేధం విధించే ఆలోచనుందని సీపీఎస్సీ కమిషనర్ వెల్లడించారు.
ఈ వివరణతో సామాన్య ప్రజల నుంచి సంపన్న కుటుంబాల వరకు అందరి గుండెల్లో ఆందోళన మొదలవ్వగా… ఈ విషయం డెమోక్రాటిక్ ప్రతినిధులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు.
గ్యాస్టవ్లను వదిలి ఎలక్ట్రిక్ స్టవ్‌లకు మారటమంటే ఖర్చు పెరిగిపోతుందని,నెలనెలా కూడా ఇంధన బిల్లు పెరుగుతుందనేది అందరి ఆందోళన అని,అంతగా ప్రమాదాన్ని ఎదుర్కోవాలి అంటే వంటింట్లో గాలివెలుతురు వచ్చేలా ప్రజల్ని అప్రమత్తం చేయాలిగానీ గ్యాస్టవ్లపై నిషేధం విధించటం ఏంటనీ వాదించారు.
మరో పక్క ఈ వివాదంపై రిపబ్లికన్ పార్టీ ప్రతినిధి రోనో జాక్సన్ మాట్లాడుతూ గ్యాస్టవ్ను వదులుకునే సమస్యేలేదని,అధ్యక్ష భవనంలోని పిచ్చివాళ్లు నా ఇంటికొచ్చి స్టవ్‌ను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే అది నా శవం మీదుగానే జరుగుతుందని వ్యాఖ్యానించారు.దమ్ముంటే రండి అంటూ హెచ్చరించారు.
అయితే ఈ విషయంపై అక్కడ ఆందోళన ఎక్కువ అవ్వడం గమనించిన సీపీఎస్సీ కొంచెం వెనక్కి తగ్గింది.నిషేధం ఆలోచన మాత్రమే తప్ప అది నిర్ణయం కాదని,ఒకవేళ నిర్ణయం తీసుకుంటే కొత్త గ్యాస్టవ్లకే అది వర్తిస్తుందని.. పాతవాటికి కాదని అంటూ సీపీఎస్ సీ వెల్లడించింది.
అమెరికా ఈ గ్యాస్ స్టవ్‌ల బదులు ఎలక్ట్రిక్ స్టవులను ఉపయోగిస్తుందా? లేక వేరే ఆలోచన ఏదైనా చేస్తుందా? అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

What do you think?

280 Points
Upvote Downvote

వారసత్వానికి వ్యాపార బాధ్యతలు అప్పగించబోతున్న బెర్నార్డ్ ఆర్నాల్ట్.ఇక ఆయన కంపెనీ బాధ్యతంతా ఆమెదే.

అర్ధిక సంక్షోభంతో విలవిల లాడుతున్న పాక్ పరిస్తితి మెరుగైయేనా?