in ,

రాజమౌళి కి న్యూయార్క్‌ ఫిలిం క్రిటిక్స్‌ సర్కిల్‌(NYFCC) ఉత్తమ దర్శకుడి అవార్డు, ఈ అవార్డు తో ఆస్కార్ వచ్చినట్టే…!?

తెలుగు సినీ పరిశ్రమని పాన్ ఇండియా పరిశ్రమగా మార్చి మన సినిమాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన దర్శకుడు రాజమౌళి. ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాలు చాలా తక్కువే అయినప్పటికీ ప్రతి సినిమా మన సినీ పరిశ్రమ స్థాయిని పెంచినవే కావడం విశేషం. ఆయన తీసిన ఆర్.ఆర్.ఆర్. సినిమా కూడా ప్రేక్షకుల నుంచి ఎంత ఆదరణ పొందిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ సినిమానే రాజమౌళి చెంతకు మారో ప్రతిష్టాత్మక అవార్డు వచ్చేలా చేసింది.

వివరాల్లోకి వెళ్తే అవార్డులను అవలీలగా దక్కించుకునే దర్శకుడు రాజమౌళిని ఇటీవలే న్యూయార్క్‌ ఫిలిం క్రిటిక్స్‌ సర్కిల్‌(NYFCC) ఉత్తమ దర్శకుడి అవార్డుతో సత్కరించింది. అవార్డు అందుకున్న రాజమౌళి సినిమా గురించి, ప్రేక్షకుల గురించి మాట్లాడుతూ “ఉత్తమ దర్శకుడిగా ఈ అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఆర్‌.ఆర్‌.ఆర్‌ చిత్రాన్ని భారతీయులు ఎంతగా ఇష్టపడ్డారో ఇక్కడివారు కూడా అంతే ఇష్టపడ్డారు. భాషకు, ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ సినిమాను తమ సినిమాగా మనసుకు సొంతం చేసుకుని ఆదరించి మంచి విజయాన్ని అందించారు. నేను తీసిన సినిమాను ఇంతగా ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తుంటే ఇంతకన్నా నాకు ఏం కావాలి?” అంటూ తన సంతోషాన్ని అందరితో పంచుకున్నారు. ఈ సందర్భంగా తన భార్య రమా రాజమౌళితో ఫోటోకి పోస్ కూడా ఇచ్చారు రాజమౌళి.
ఈ అవార్డు తో ఆస్కార్ అవకాశాలు మరింత బలపడ్డాయి.

What do you think?

192 Points
Upvote Downvote

‘మెగా బ్లాక్బస్టర్’ తో హిట్ మ్యాన్ తెరంగ్రేటం

జెఈఈ మెయిన్స్ (JEE Main) 2023 వాయిదా పడుతుందా…!?