in

జెఈఈ మెయిన్స్ (JEE Main) 2023 వాయిదా పడుతుందా…!?

జెఈఈ మెయిన్స్(JEE Main) 2023: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(Nta) జేఈఈ మెయిన్ మొదటి సెషన్ కి పేపర్ -1 కి సంబంధించిన పరీక్ష తేదీలను ఇటీవలే విడుదల చేసిందన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ పరీక్షకు హాజరుకాబోతున్న విద్యార్ధులు పరీక్షలను పోస్ట్పోన్ (postpone) చేయమని అడుగుతుండడంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వివరాల్లోకి వెళ్తే జెఈఈ మెయిన్ మొదటి సెషన్ కి పేపర్ -1 కి సంబంధించిన పరీక్షలను జనవరి 24 నుంచి 31 నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(Nta) ఇటీవలే ప్రకటించింది. కాగా సిబిఎస్ఈ బోర్డ్ ప్రాక్టికల్ పరీక్షలు కూడా సుమారుగా ఇదే సమయానికి జరుగుతుండడంతో రెండు పరీక్షలు తమకు ముఖ్యమైనవే అని, రెండిటి మధ్య తక్కువ సమయం ఉండడం వల్ల వాటికి చదివి రాయడంలో ఇబ్బందిగా ఉంటుందనీ విద్యార్థులు చెప్పుకొచ్చారు. పరీక్షలను కుదిరితే ఏప్రిల్ నెలకి పోస్ట్పోన్ చేయమని, లేదంటే వాటిని ప్రస్తుతానికి వాయిదా వేయమని ఎన్.టి.ఏ(Nta) ను విద్యార్థులు కోరుతున్నారు.

వాటిని వాయిదా వేయమంటూ ట్విట్టర్ వేదికగా పోస్టుల వర్షాన్ని కురిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో విద్యార్ధులందరూ కలిసి బొంబాయ్ (Bombay) హై కోర్ట్ లో పరీక్షలను పోస్ట్పోన్ చేయమంటూ పిటీషన్ కూడా వేశారు. కాగా దీనిపై జనవరి 10న బొంబాయ్ హై కోర్టు చర్చించబోతోంది.

What do you think?

42 Points
Upvote Downvote

రాజమౌళి కి న్యూయార్క్‌ ఫిలిం క్రిటిక్స్‌ సర్కిల్‌(NYFCC) ఉత్తమ దర్శకుడి అవార్డు, ఈ అవార్డు తో ఆస్కార్ వచ్చినట్టే…!?

22వేలకు పైగా స్కూళ్లలో 15వందల కోట్ల రూపాయల పనులు – సీఎం జగన్