విడుదలైన టీఎస్పీఎస్సీ గ్రూప్-1 హాల్ టికెట్లు.
టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో టీఎస్పీఎస్సీ అందుబాటులో ఉంచింది.
అయితే గతంలో లీకేజీ కారణంగా రద్దయిన పరీక్ష హాల్ టికెట్లు ఇప్పుడు చెల్లవని, పరీక్షకు హాజరు కావాలంటే కొత్తవి డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.
ఇక ఈ పరీక్ష జూన్ 11న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనుండగా.. 503 పోస్టులకు గాను 3.80లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని అధికారులు వెల్లడించారు.