in ,

22వేలకు పైగా స్కూళ్లలో 15వందల కోట్ల రూపాయల పనులు – సీఎం జగన్

విద్యార్థులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అయితే విద్యార్థుల చదువుల గురించి,వారి సౌకర్యాల గురించి ఇటీవలే సీఎం జగన్ అధికారులతో చర్చించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్ధికీ విద్యా బోధనలో ఏ మాత్రం నాణ్యత లోపించినా సహించేది లేదని అధికారులకు మరో సారి తేల్చి చెప్పారు. ప్రతి స్కూల్లో సబ్జెక్టుల వారీగా ప్రతి సబ్జెక్ట్ కి టీచర్లు ఉండేలా చూసుకోవాలన్నారు.సబ్జెక్టులకి వేరు వేరు టీచర్లు ఉంటే బోధనలో నాణ్యత పెరుగుతుందని చెప్పారు. అదే విధంగా విద్యార్ధుల అభ్యాసం కూడా మెరుగుపడుతుందని, తద్వారా వారి మంచి భవిష్యత్ కి బాట వేసిన వాళ్ళం అవుతామని సీఎం జగన్ అన్నారు. నాడు-నేడు కింద జరుగుతోన్న రెండో దశ పనులను అధికారులను నిత్యం పర్యవేక్షిస్తూ ఉండమని ఆదేశించారు.

ప్రస్తుతం 22వేలకు పైగా స్కూళ్లలో 15వందల కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్స్‌ పంపిణీ పూర్తయిందని,వాటిపై విద్యార్ధులకు అవగాహన వచ్చేలా,వాటిని వాడటం తెలిసేలా టీచర్లు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. విద్యార్థులు పాఠాలు నేర్చుకుంటున్న రీతిపై ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ ద్వారా చెక్‌ చేస్తూ ఉండాలని జగన్ చెప్పారు.అదే విధంగా ట్యాబుల మెయింటెనెన్స్‌ కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక సర్వీస్‌ సెంటర్‌ ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.ఒక వేళ ట్యాబ్‌లో ఏదైనా సమస్య వస్తే వారం రోజుల్లో రిపేర్‌చేసి ఇవ్వాలని, కుదరకపోతే వెంటనే కొత్త ట్యాబ్‌ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్ధులందరి దగ్గర డిక్షనరీలు ఉన్నాయో…లేదో… చెక్ చేయడంతో పాటు వారిని శ్రద్ధ పట్టించుకోమని అన్నారు.

ఒకవేళ ఎవరి దగ్గరైనా లేకపోతే వెంటనే వారికి అందించాలని చెప్పారు.నెక్ట్స్‌ అకడమిక్‌ ఇయర్‌కి అందించే విద్యా కానుక కోసం ఇప్పట్నుంచే అన్నీ సిద్ధం చేసుకోమని అధికారులను ఆదేశించారు. అది కూడా విద్యా సంవత్సరం మొదలైన రోజే వాటిని అందించేలా చూడాలని అధికారులకు స్పష్టంగా చెప్పారు.పాఠశాల గదుల్లో డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయాలని అధికారులతో అన్నారు.అదే విధంగా డిజిటల్‌ స్క్రీన్స్‌ కోసం ఐఎఫ్‌సీ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

What do you think?

71 Points
Upvote Downvote

జెఈఈ మెయిన్స్ (JEE Main) 2023 వాయిదా పడుతుందా…!?

వీల్ చైర్ టు వరల్డ్ ఛాంపియన్… విథి కూడా కంపించింది