in

వీల్ చైర్ టు వరల్డ్ ఛాంపియన్… విథి కూడా కంపించింది

దీపా మాలిక్ (ఛాంపియన్) భారతదేశం గర్వించదగ్గ పారా అథ్లెట్లలో ఒకరు. ఈమె హర్యానాలోని  భైస్వాల్ లో జన్మించింది. 1999లో వెన్నెముకలో చిన్న గడ్డ ఏర్పడడం వల్ల మూడు సర్జరీలు జరిగి 183 కుట్లు వేశారు., అప్పటి నుంచి వీల్చైర్ కే పరిమితం అయింది.

విధి చేసిన వైపరీత్యాన్ని ఒప్పుకోలేదు, ఎదిరించి నిలబడాలి అనుకుంది, పోరాడాలి అనుకుంది. ఆమెకు చిన్నప్పట్నుంచీ క్రీడలు అంటే ఇష్టం. ఆ క్రీడల్లో నే రాణించాలి అనుకుంది, ఎట్టకేలకు 36వ యేట మళ్ళీ ఆటల్లో అడుగుపెట్టింది. విభిన్న క్రీడా రంగాల్లో సత్తా చాటుతూ భారత్లో ఉత్తమ పారా అథ్లెట్ గా నిలిచింది. స్విమ్మింగ్ , జావలిన్ త్రో, షాట్పుట్ వంటి వివిధ క్రీడల్లో అనేక పతకాలు సాధించింది. నాలుగు సార్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో పేరు సంపాదించింది.  దానితో భారత ప్రభుత్వం ఆమె ప్రతిభను గుర్తించి, అర్జున అవార్డుతో సత్కరించింది. ఖేల్ రత్న అవార్డు కూడా అందుకుంది. ఖేల్ రత్న అందుకున్న తొలి మహిళ పారా అథ్లెట్ గా పేరు తెచ్చుకుంది. 2016లో పారా ఒలంపిక్స్ లో, షార్ట్ పుట్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించింది.

విధి తన జీవితాన్ని వీల్చైర్ పరం చేసినా,  పోరాడి ప్రపంచ స్థాయికి ఎదిగింది. విజయాన్ని సొంతం చేసుకుంది.

What do you think?

85 Points
Upvote Downvote

22వేలకు పైగా స్కూళ్లలో 15వందల కోట్ల రూపాయల పనులు – సీఎం జగన్

37 ఏళ్ల వయసు నుండి 25 ఏళ్ల వయసు కుర్రాడిలా మారిన క్రిస్టియానో రోనాల్డో