in ,

నాపై “ఫెయిల్యూర్ కెప్టెన్” ముద్రవేశారు-కోహ్లీ

టీంమిండియా ఆటగాడిగా ఎన్నో అవార్డులను అందుకోవడంతో పాటు రికార్డులతో చరిత్ర సృష్టిస్తూ అబ్బురపరిచే విరాట్ కోహ్లీ తనపై “ఫెయిల్యూర్ కెప్టెన్” ముధ్రవేసారని అంటూ తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు. ఐసీసీ ట్రోఫీని సాధించకపోవడంపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలో 2011 వన్డే ప్రపంచ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని టీమ్ ఇండియా దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ రెండు టోర్నీల్లోనూ విరాట్ కోహ్లి జట్టులో ఆటగాడిగా విశేషమైన పాత్ర పోషించారు. అయితే కెప్టెన్గా ఐసీసీ ట్రోఫీని సాధించపోవడంతో కొంతమంది విశ్లేషకులు, అభిమానులు తనపై ‘ఫెయిల్యూర్ కెప్టెన్’ అనే ముద్ర వేశారని టీమిండియా మాజీ కెప్టెన్ గా వ్యవహరించిన కోహ్లి అన్నారు. మేజర్ టోర్నమెంట్లలో టీంను సెమీ ఫైనల్స్ వరకు తీసుకెళ్లడంలో విజయం సాధించినప్పటికీ ట్రోఫీలు గెలకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పారు. అయితే ఆ విమర్శలను తాను పట్టించుకోనని, తన నాయకత్వంలో జట్టు ఆటతీరులో చాలా మార్పులు రావడంతో గర్వపడుతున్నానని కోహ్లి అన్నారు.

“గెలవడం కోసం టోర్నమెంట్లను ఆడతాం. నేను ఛాంపియన్స్ ట్రోఫీ 2017, 2019 ప్రపంచ కప్ టోర్నీకి కెప్టెన్గా ఉన్నాను. 2021లో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్తోపాటు అదే ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ నకు కూడా సారథ్యం వహించా. నాలుగు ఐసీసీ టోర్నమెంట్ల తర్వాత నాపై ఫెయిల్యూర్ కెప్టెన్గా ముద్రవేశారు. ఆ కోణంలో నన్ను నేను ఎప్పుడూ అంచనా వేసుకోలేదు. మేం జట్టుగా ఏం సాధించాం, మా ఆటతీరులో వచ్చిన మార్పులు నాకు గర్వకారణం. ఒక టోర్నమెంట్ నిర్దిష్ట కాల వ్యవధిలో జరుగుతుంది.

కానీ, జట్టు ఆటతీరులో మార్పు అనేది సుదీర్ఘకాలంపాటు జరుగుతుంది. అలా జరగాలంటే టోర్నమెంట్లో విజయం సాధించడానికి అవసరమయ్యే దానికంటే ఎక్కువ మంది కావాలి. నేను ఆటగాడిగా ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాను. ఐదు టెస్టు మ్యాచ్లు గెలిచిన జట్టులో నేను భాగమయ్యాను. మీరు ఆ కోణంలో చూస్తే ప్రపంచ కప్ ను ఎప్పుడూ గెలవని ఆటగాళ్లు ఉన్నారు” అని కోహ్లి పేర్కొన్నారు.

What do you think?

గ్రూప్ – 2, గ్రూప్ -3 ఉద్యోగ నియామకాల్లో మార్పు.

వినాయక్,మెగాస్టార్ల హిట్ కాంబో రిపీట్ కాబోతోందా?