in

కోహ్లిని ఎంత పొగిడినా తక్కువే- హర్భజన్ సింగ్.

విరాట్ కోహ్లి లాంటి ఆటగాడిని ఎంత పొగిడినా తక్కువే, భారత్ గెలవాలంటే విరాట్ పరుగులు చేయాల్సిందే అంటూ భారత్ మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ విరాట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఫిబ్రవరి 9 నుంచి భారత్, ఆసీస్ మధ్య టెస్టు మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కానున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అసలు విషయం ఏంటంటే భారత్ మాజీ స్పిన్నర్ హర్భజన్ తన యూట్యూబ్ చానెల్లో ఫిబ్రవరి 9 నుంచి భరత్, ఆసీస్ మధ్య జరగబోయే టెస్టు మ్యాచ్ల గురించి మాట్లాడారు. ఆ సందర్భంగా హర్బజన్ విరాట్ ఆట గురించి కూడా మాట్లాడారు.
” విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడిని ఎంత పొగిడినా తక్కువే. అతడు చాలా పరుగులు చేశాడు. అయితే కోహ్లి సెంచరీ చేసినప్పుడే అతడు ఫామ్లో ఉన్నాడని మనం అనుకుంటుంటాం. కానీ గత మూడేళ్లుగా అతడు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ప్రస్తుతం విరాట్ వన్డేల్లో ఫామ్ అందుకున్నాడు. ఇప్పటికే రెండు సెంచరీలు చేశాడు. గత రెండేళ్ల నుంచి కూడా అతడు పరుగులు చేస్తున్నాడు. కానీ, సెంచరీలు సాధించలేదు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీతో టెస్టుల్లో కూడా కోహ్లీ తిరిగి ఫామ్ అందిపుచ్చుకుని భారీగా పరుగులు చేస్తాడని భావిస్తున్నాను. ఫామ్ లో ఉన్నప్పుడు తనని ఆపడం చాలా కష్టం. ఇప్పుడు ఈ సిరీస్లో భారత్ విజయం సాధించాలంటే కోహ్లీ పరుగులు చేయాల్సిందే. అతడి నుంచి మంచి ప్రదర్శన ఆశిస్తున్నాం” అంటూ హర్భజన్ తన యూట్యూబ్ ఛానల్లో తన భావనను తెలిపారు.

What do you think?

మే 7 నుండి తెలంగాణ ప్రవేశ పరీక్షలు షురూ..

17 గంటల పాటు తన చిట్టి తమ్ముడ్ని కాపాడుకున్న బుజ్జి అక్క.