in

గెలుపుతో పాటు జీవితాన్ని కూడా తీసుకెల్లిపోయిన ఆట…నాక్ ఔట్

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ జీవితాన్ని సంతోషంగా జీవించాలని కోరుకుంటారు. కానీ ఆ జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో,సంతోషం దుఖంగా ఎప్పుడు మారుతుందో ఎవరు ఊహించలేరు. అప్పటి వరకు సంతోషంగా సాగిన బాక్సింగ్ ఛాంపియన్ ప్రిచార్డ్ కొలోన్ జీవితం కూడా ఇదే విధంగా ఒక్క క్షణంలో తలకిందులైపోయింది.

 

ఫ్లోరిడాలోని మైట్లాండ్కు చెందిన ప్రిచార్డ్ తన కుటుంబంతో 10 ఏళ్ల వయసులో ప్యూర్టో రికోలో నివసించడానికి వచ్చేసాడు. చిన్నతనం నుంచే బాక్సింగ్ పై అపారమైన ఆసక్తిని చూపుతూ ఎప్పుడూ బాక్సింగ్ గురించే ఆలోచించేవాడు. తను కోరుకున్న విధంగానే లక్ష్యాని చేరుకోవడానికి సాధన చేసిన ప్రిచార్డ్ కొలోన్ 2010లో పాన్ అమెరికన్ యూత్ ఛాంపియన్షిప్లో పాల్గొనడంతో పాటు గోల్డ్ మెడల్ను గెలుచుకున్నాడు. ఆపై 2013లో పూర్తి స్థాయి బాక్సింగ్ ఆటగాడిగా మారిన ప్రిచార్డ్ తను ఆడిన ప్రతి మాచ్లోను అద్భుతమైన ప్రతిభ చూపడంతో పాటు వరల్డ్ ఛాంపియన్గా అవ్వడమే తన లక్ష్యంగా ముందుకు సాగాడు. అలా ఆడిన ప్రతి సారి అందర్నీ ఆశ్చర్యపరుస్తూ తన బాక్సింగ్ జీవితంలో ఓటమి తెలియని ఆటగాడిగా దూసుకుపోయాడు.

 

తరువాతి కాలంలో డబ్ల్యు.బి.సి వరల్డ్ చాంపియన్గా కూడా నిలిచాడు. తను ఆడిన 17 మ్యాచులలో 15 మ్యాచులు నాక్ ఔట్ చేసి గెలచిన ప్రిచార్డ్ వరల్డ్ లైట్ వెల్టర్ వెయిట్ ఛాంపియన్ వివియన్ హర్రిస్ను కూడా ఇదే విధంగా మట్టి కర్పించాడు. అయితే ప్రిచార్డ్ ఒకటి తలిస్తే జీవితం మరొకటి తలిచింది. తను ఆడిన 17వ మ్యాచ్ తన గెలుపుతో పాటు తన జీవితాన్ని కూడా తీసుకెళ్ళిపోతుందని ఎవరు ఊహించలేదు. 2015లో ప్రిచార్డ్ కొలోన్కు,టెర్రే విలియమ్స్కు జరిగిన మ్యాచ్లో విలియమ్స్ తన రాబిట్ పంచెస్తో ప్రిచార్డ్ తల వెనుక భాగంలో పదే పదే కొట్టడంతో ప్రిచార్డ్  మెదడు కోలుకోలేని విధంగా దెబ్బతింది. కోమాలోకి జారుకున్న ప్రిచార్డ్ అదృష్టవసాత్తు 7 నెలల తరువాత కోమాలో నుంచి బయటకి వచ్చినప్పటికీ అంతా మారిపోయింది. తను ఊపిరి పీల్చుడం తప్ప మరేపని తనంతట తాను చేసుకొలేని దుస్థితికి గురయ్యాడు.

 

అప్పటి నుంచి తన తల్లిదండ్రులే తనని కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తున్నారు. 2021లో సర్జరీ జరిగిన తరువాత కళ్ళతో సైగ చేస్తూ తన భావనలు తెలుపగలుగుతున్న ప్రిచార్డ్ ఇప్పటికీ బాక్సింగ్ ఆడలేకాపోతున్నానని బాధపడుతూ జీవనం కొనసాగిస్తున్నాడు.

What do you think?

62 Points
Upvote Downvote

గోల్డ్ మెడలిస్ట్ నుంచి తనను తాను పోషించుకొలేని స్థితికి పడిపోయిన మీనాక్షి రాణీ.

“పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ పట్టించుకోవడం లేదు….”షాహిద్ అఫ్రిదీ