in ,

రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు రాజకీయాల్లోకి?

రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు రాజకీయాల్లోకి వస్తున్నాడా?

 

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. నేడు (మే 29న) గుజరాత్ టైటాన్స్ తో ఆడే ఆటే తన చివారి ఆట అంటూ రాయుడు వెల్లడించాడు.

2010లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన రాయుడు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు a 203 మ్యాచ్ లు ఆడి మొత్తం 4,329 పరుగులు చేశాడు.

2010-2017 వరకు ముంబయి ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహించిన అంబటి రాయుడు నిలకడగా ఆడుతూ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. ఇప్పటివరకు ఐదు టైటిల్స్ ను గెలుచుకున్నాడు. నేడు గుజరాత్ పై చెన్నై గెలిస్తే ఆరో టైటిల్ ను ఖాతాలో వేసుకుంటాడు. ముంబయి ఇండియన్స్ తరపున (2013, 2015, 2017).. చెన్నై సూపర్ కింగ్స్ తరపున (2018, 2021)లో టైటిల్ ను అందుకున్నాడు. 2018 లో సీఎస్కే ఛాంపియన్ గా నిలవడంలో కీలకపాత్ర రాయుడిదే. ఆ సీజన్లో 16 మ్యాచ్ లు ఆడి 43 సగటుతో 602 పరుగులు సాధించాడు. అదే సీజన్లో ఐపీఎల్లో శతకాన్ని నమోదు చేశాడు. అతడి కెరీర్‌లో ఓ ఐపీఎల్ సెంచరీ కూడా ఉంది.

అయితే రాయుడు పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తుండగా.. అంబటి రాయుడు ఇప్పటికే ఏపీ సీఎం జగన్‌కు టచ్‌లోకి వెళ్లాడు. కొన్ని రోజుల క్రితం స్వయంగా తాడేపల్లిలోని సీఎం క్వాంప్‌ ఆఫీస్‌కి వెళ్లి మరీ వైయస్ జగన్‌తో భేటీ అయ్యాడు.

కాగా అతని నుంచే వైసీపీలో చేరిక పై క్లారిటీ వస్తుందని పలు రాజకీయ నేతలు అభిప్రాయడుతున్నారు.

What do you think?

టీఎస్పీఎస్సి పేపర్‌ లీక్‌ కథలో కొత్త మలుపు.

నిక్కీ హత్య కేసులో ఎట్టకేలకు చిక్కిన నిందితుడు.