in

మరో సారి చరిత్ర సృష్టించిన రోనాల్డో…కానీ ఈ సారి ఆటలో కాదు.

పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో ఫుట్ బాల్ క్రీడలో అతనొక లెజెండ్. ఆయన తిరగ రాసిన చరిత్ర, సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. అలాంటి  రోనాల్డో ఇప్పుడు మరో కొత్త రికార్డ్ను సృష్టించాడు.కానీ ఆ రికార్డ్ ఆటలో కాదండీ.అసలేం జరిగింది? ఆ రికార్డ్ ఎంటి ఈ సారి ఏమి తిరగరాశాడు..చూద్దాం.

తమకు ఇష్టమైన తారలను ఫేస్ బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం అందరికీ అలవాటు. సినీ తారలను,టివీ తారలను,ఆట గాళ్లను ఇలా ఎవరికి ఇష్టమైన వారిని వాళ్లు ఫాలో అవుతుంటారు. అయితే తాజా క్రిస్టియానో రోనాల్డో తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తనను అనుసరించే వారి సంఖ్య 50 కోట్లకు చేరింది. ఆ విధంగా అంత మంది ఫాలోవర్లను కలిగిన ఏకైక వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు.

మరో ఫుట్ బాల్ ఆటగాడు లియొనల్ మెస్సీ 37.5 కోట్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉండగా,అమెరికా టీవీ తార కైలీ జెన్నర్ 37.2 కోట్ల ఫాలోవర్లతో,సెలీనా గోమెజ్ 35.8 కోట్ల ఫాలోవర్లతో తరువాతి స్థానాలలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న రోనాల్డో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఏ ఒక్క రికార్డ్ను రోనాల్డో వదిలి పెట్టట్లేదు కదా…

What do you think?

86 Points
Upvote Downvote

2022లో అద్భుతమైన ప్రతిభతో అవార్డులు అందుకున్న భారత్ ఆటగాళ్ళు…

‘మెగా బ్లాక్బస్టర్’ తో హిట్ మ్యాన్ తెరంగ్రేటం