in

చరిత్ర సృష్టించిన 21 ఏళ్ల అమ్మాయి భూమిక శర్మ, “భారతదేశ జెండా అక్కడ ఎగర వేయడం చాలా ఆనందంగా అనిపించింది”

ఎప్పుడైనా ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు అది అయ్యేంత వరకు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించాలని అంటూ ఉంటారు. అలాంటి పట్టుదలతోనే అప్పటి వరకు ఎవరూ చేయలేని పనిని చేసి చూపింది భూమిక శర్మ.

ఉత్తరాఖండ్కు చెందిన భూమిక శర్మకు ఎప్పుడూ మిస్ ఓల్డ్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్ అవ్వాలని కోరికగా ఉండేదట. అందువల్లనే డెహ్రాడున్లో వాళ్ళ కుటుంబానికి చెందిన జింలో కసరత్తు చేయడం ప్రారంబించింది. ఆ తరువాత లక్ష్యానికి కొంచెం దగ్గరౌదామనే ఉద్దేశంతో ఢిల్లీ బాడీ బిల్డింగ్ క్లబ్లో చేరిన ఆమె తరువాత కొన్ని నెలలకే ఇంటికి తిరిగి వచ్చేసింది. ఒకానొక సమయంలో భారతీయ మహిళలకు వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ ఇవ్వడంలో ఆమె తల్లి హన్సా మన్రాయ్ కోచ్గా ప్రధాన పాత్ర పోషించినప్పటికీ ఆమెకి కూడా బాడీ బిల్డింగ్లో భూమిక భవిష్యత్ కనిపించలేదట. కానీ తన ఆశయం అక్కడితో ఆగిపోలేదు. ఢిల్లీలో తనకు పరిచయమైన జిమ్లోని ఒక బోధకుడి సూచనల ద్వారా మళ్ళీ మిస్ ఓల్డ్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ వైపు అడుగులు వేయడం ప్రారంభించింది. అలా అతని సహాయంతో కఠినమైన ఆహార పద్ధతులు కసరత్తు చేసిన భూమిక శర్మ 2017లో మిస్ ఓల్డ్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్ అయ్యి చరిత్ర సృష్టించింది.

మొట్ట మొదటి సారిగా మిస్ ఓల్డ్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న మహిళగా భారతదేశ గౌరవాన్ని పెంచింది. 2017లో ఛాంపియన్షిప్ గెలుచుకున్నప్పుడు 21 ఏళ్లు కలిగిన భూమిక తన విజయం గురించి మాట్లాడుతూ తనను విజేతగా ప్రకటించినప్పుడు భారతదేశ జెండా అక్కడ ఎగర వేయడం తనకు చాలా ఆనందంగా అనిపించిందని తెలియచేసింది. ఎదైమైనా మన దేశానికి చెందిన ఒక అమ్మాయి ఇలా గెలిచిందంటే చాలా ఆనందంగా ఉంది కదా…..

What do you think?

61 Points
Upvote Downvote

37 ఏళ్ల వయసు నుండి 25 ఏళ్ల వయసు కుర్రాడిలా మారిన క్రిస్టియానో రోనాల్డో

“తగ్గేదే లే” పార్టీలో చితకొట్టుకున్న చిరు, బాలయ్య ఫ్యాన్స్