ఆస్ట్రేలియాకు(ఆసీస్),జింబాబ్వేకు జరిగిన మ్యాచ్ ప్రపంచాన్నే ఆశ్చర్యపడేలా చేసింది.
సెప్టెంబర్ 3వ తేదీన ఆసీస్ సొంత గడ్డ ఆస్ట్రేలియాలోని రివర్ వే మైదానంపై జరిగిన జింబాబ్వే వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో ఆస్ట్రేలియా అపజయం పాలైంది. ఇప్పటి వరకు జరిగిన 33 ఓ.డి.ఐ మ్యాచలలో ఆస్ట్రేలియా 29,జింబాబ్వే 3 మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించగా,1 మ్యాచ్ ఫలితం వెల్లడించకుండానే ముగిసింది. ఇంతకు ముందు ఆసీస్ తో ఆస్ట్రేలియాలో జరిగిన ఏ ఫార్మెట్ మ్యాచ్లోనూ జింబాబ్వే గెలవకపోవడం,ఇదే వారి తొలి విజయం కావడం గమనార్హం.
జింబాబ్వే టాస్ గెలిచినప్పటికి బౌలింగ్ ఎంచుకుని ఆస్ట్రేలియా ఆటగాళ్లకు వణుకు పుట్టించింది. జింబాబ్వే జట్టు గాయపడినప్పటీకీ పూర్తి జట్టుతో వచ్చిన ఆసీస్ ను చిత్తుకింద ఓడించింది. ర్యాన్ బర్ల్ 3 ఓవర్ల్ లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను పడకొట్టాడు. కేవలం 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి గెలవడం కష్టమే అనిపించినా రేజీస్ చకబవ 37 బంతుల్లో 72 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచి,జింబాబ్వే గెలుపుకు కారణమయ్యాడు. ఆసీస్ చేసిన 141 పరుగులలో డేవిడ్ వార్నర్ 94 పరుగులు చేయగా,గ్లెన్ మాక్స్వెల్ 19 పరుగు తీసి పర్లేదనిపించుకున్నాడు. మిగతా సభ్యులు కలిసి కేవలం 28 పరుగులతో సరిపెట్టుకున్నారు. ఏదేమైనా ఆసీస్ ను తమ సొంత గడ్డ ఆస్ట్రేలియాలోనే మట్టి కరిపించి జింబాబ్వే చరిత్ర సృష్టించారు.