in

“తగ్గేదే లే” పార్టీలో చితకొట్టుకున్న చిరు, బాలయ్య ఫ్యాన్స్

హీరోలందరూ ఒకరితో ఒకరు పరస్పరం కలుసుకుంటారు, రెండు మూడు మంచి మాటలు మాట్లాడుకుంటారు. మళ్ళీ ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీ అయిపోతారు. కానీ చిక్కంతా వచ్చేది ఆ హీరోల ఫ్యాన్స్ మధ్య ఈగోతో మాటల తూటాలు పేలినప్పుడే. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకూ అంటారా? ఎందుకంటే త్వరలో బాలయ్య “వీర సింహా రెడ్డి“, చిరంజీవి “వాల్తేరు వీరయ్య” సినిమాలు ఒక్క రోజు తేడాతో విడుదల కాబోతున్నాయి కాబట్టి.

ఇక విషయంలోకి వెళ్తే మెగా స్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో నటించిన చిత్రం “వాల్తేరు వీరయ్య” జనవరి 13న విడుదల కాబోతుంది. మరో పక్క మాస్ మాన్స్టర్ (Monster) బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శత్వంలో నటించి ఇదే నెల జనవరి 12న విడుదల కాబోతున్న చిత్రం “వీర సింహా రెడ్డి”. ఇలా ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒక రోజు తేడాతో విడుదల కాబోతున్నాయి.

ఇది ఇలా ఉండగా డిసెంబరు 31వ తేది రాత్రి కొంతమంది ఎన్ఆర్ఐ యువకులు డల్లాస్ లో “తగ్గేదే లే” పేరుతో మ్యూజికల్ నైట్ ని నిర్వహించుకున్నారు. అయితే ఆ పార్టీకి వచ్చిన వారిలో కొంత మంది మెగా అభిమానాలు, కొంత మంది బాలయ్య అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్ జై పవన్, జై మెగా స్టార్ అంటూ, బాలయ్య ఫ్యాన్స్ జై బాలయ్య అంటూ నినాదాలు చేయడం మొదలు పెట్టారు. ఈ సందర్భంగా మాటలలో మాటగా బాలయ్య అన్ స్టాపబుల్ (Unstoppabble) షోకి పవన్ కళ్యాణ్ రావడంపై ప్రస్తావన రాగా చిన్న వివాదంగా మొదలై మాటా మాటా పెరిగి ఆక్కడి వాతావరణం హీటెక్కింది.

ఆ తరువాత ఇరు హీరోల ఫ్యాన్స్ రెచ్చిపోయి గొడవలోకి దిగడంతో పలువురికి గాయాలయ్యాయి. వాళ్ళని ఆపుదామని ఈవెంట్ మేనేజర్లు,సెక్యూరిటీ ప్రయత్నించినప్పటికీ పలితం లేకపోయింది. ఇక వాళ్ళు చేసేదేమీ లేక పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఈ క్రమంలో బాలయ్య అభిమాని కేసీ చేకూరిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.

అయితే ఇలా చిన్న మాట చిలికి చిలికి నిప్పురవ్వ అవ్వడంతో త్వరలో విడుదలకు సిద్దంగా ఉన్న ఈ ఇరువురి సినిమాలు ఒక్క రోజు తేడాతో విడుదల కాబోతుండడంతో.. ఏ హీరో సినిమా విజయం సాధిస్తుంది? ఒక వేళ ఒక హీరో సినిమా మాత్రమే విజయాన్ని పొందితితే ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారు?అన్న ప్రశ్నలతో ఇటు హీరోల మధ్య, అటు ఫ్యాన్స్ మధ్య ఉత్కంఠత నెలకొంది.

What do you think?

122 Points
Upvote Downvote

చరిత్ర సృష్టించిన 21 ఏళ్ల అమ్మాయి భూమిక శర్మ, “భారతదేశ జెండా అక్కడ ఎగర వేయడం చాలా ఆనందంగా అనిపించింది”

మెట్రో స్టేషన్ లో మరో ఆత్మ హత్య…ప్రాణం విలువ అరక్షణం నిలిచే బాధంతేనా…?