in

మెట్రో స్టేషన్ లో మరో ఆత్మ హత్య…ప్రాణం విలువ అరక్షణం నిలిచే బాధంతేనా…?

ఎవరు ఎప్పుడు ఎందుకు వారి ప్రాణాలను తీసుకుంటారో ఎవరూ ఊహించలేరు? వాళ్ళ ప్రాణాల మీద వారికే అంత చిన్న చూపో? లేక వారికి వాళ్ళ ప్రాణం విలువ తెలియదో? అర్థం కాదు. కోపంలోనో….బాధలోనో….సులువుగా ప్రాణాలను తీసేసుకుంటారు. తల్లిదండ్రులకు పశ్చాత్తాపాన్ని మిగులుస్తారు. ఇప్పుడు ఇలాంటి పిచ్చి, మూర్ఖపు పనినే మరోసారి చేసి ఒక వ్యక్తి తన ప్రాణాలను తానే గాల్లో కలిపేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే కొన్ని రోజుల క్రితం నాగోలుకు చెందిన ఒక మహిళ ఇంట్లో జరుగుతున్న ఆర్థిక ఇబ్బందులను తట్టుకొలేక మెట్రో స్టేషన్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. కొన ఊపిరితో ఉన్న ఆమెని తరువాత ఆసుపత్రికి కి తరలించగా… అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్ధారించి చెప్పారు.

అయితే ఈ సంఘటనను మరువక ముందే మరోసారి హైదరాబాద్ మూసాపేట్ మెట్రో స్టేషన్ లో ఒక గుర్తు తెలియని వ్యక్తి ట్రైన్ ముందు దూకి ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. మొదటిగా టికెట్ తీసుకోకుండా స్టేషన్ పైకి వచ్చిన ఆ వ్యక్తి కొంత సేపు స్టేషన్ పై నుంచున్న తరువాత సరిగ్గా ట్రైన్ రాగానే హఠాత్తుగా ట్రైన్ ముందు దూకి ప్రాణాలను తీసుకున్నాడు. ఇదంతా అక్కడ ఉన్న సీసీ టీవీ లో రికార్డ్ అవ్వగా… సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేసి సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా ఆ వ్యక్తి ఎవరన్న దానిపై విచారణ చేస్తున్నారు.
అయితే మెట్రో స్టేషన్ లలో ఎంతటి కఠిన భద్రత పెట్టినప్పటికీ ఇలా వరుస ఆత్మ హత్యలు జరగడం గమనార్హం. ఇక మీదటైనా అధికారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించి ఈ ఆత్మ హత్యలు అడ్డుకుంటారని కోరుకోవడం తప్ప ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి.

What do you think?

68 Points
Upvote Downvote

“తగ్గేదే లే” పార్టీలో చితకొట్టుకున్న చిరు, బాలయ్య ఫ్యాన్స్

మంత్రి రోజా, జనసేన నేత నాగబాబుకి మధ్య మాటల యుద్ధం