in

టీిం ఇండియా బౌలర్ అర్ష్ దీప్ ఒక కొత్త చెత్త రికార్డును తన కాతాలో వేసుకున్నాడు. ఒకే ఓవర్లో 27 పరుగులు సమర్పించుకున్నాడు.

టీిం ఇండియా బౌలర్ అర్ష్ దీప్ ఒకే ఓవర్లో 27 పరుగులిచ్చి ఒక కొత్త చెత్త రికార్డ్ తన కాతాలో వేసుకున్నాడు. వీడేమి బౌలర్ రా బాబూ.. అనిపించాడు.
వివరాల్లోకి వెళ్తే ఇటీవల జనవరి 27న న్యూజిలాండ్ కి మరియు టీమ్ ఇండియాకు 2023 ఏడాది తొలి టీ 20 మ్యాచు రాంచీలోని జె.ఎస్.సి.ఎ ఇంటర్నేషనల్ స్టేడియంలో చోటు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో టీం ఇండియా బౌలర్ అర్ష్ దీప్ దారుణమైన ప్రదర్శన కనబరిచాడు.తను వేసిన 4 ఓవర్లలో కేవలం 1 వికెట్ మాత్రమే తీయగలిగాడు.తన పేలవమైన బౌలింగ్ తో ఏకంగా 51 పరుగులను న్యూజిలాండ్ కి సమర్పించుకున్నాడు. ఇక చివరి ఓవర్లో డారిల్ మిచెల్ చితక బాదుడు బాదాడు. ఓవర్ తొలి బంతినే అర్ష్ దీప్ నోబాల్ వేయడంతో డారిల్ మిచెల్ సిక్సర్ బాదాడు.
తరువాత బాల్ని డీప్ బాక్వర్డ్ స్క్వేర్లెగ్ దిశగా బాదగా.. ఓవర్ రెండో బంతిని లాంగాన్ దిశగా కొట్టి హ్యాట్రిక్ సిక్సర్లు పూర్తి చేశాడు. అప్పటికే 18 పరుగులు ఇచ్చేసిన అర్ష్ దీప్ వత్తిడితో వేసిన మూడో బాల్ని మిచెల్ ఫోర్ గా మలిచాడు. ఆ తర్వాత బంతుల్లో నాలుగు పరుగులు రావడంతో మొత్తంగా ఒకే ఓవర్లో 27 పరుగులు వచ్చాయి. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో 149గా ఉన్న స్కోరు 20 ఓవర్లు ముగిసేసరికి 177గా మారిపోయింది.
దీంతో అర్ష్ దీప్ ఒక కొత్త చెత్త రికార్డ్ ను తన కాతాలో వేసుకున్నాడు. ఒకే ఓవర్లో అత్యధిక నోబాల్లు వేసిన బౌలర్గా నిలిచాడు. అర్ష్ దీప్ 22 మ్యాచుల్లో 14 నోబాల్స్ వేసి తొలి స్థానంలో నిలవగా.. ఆ తర్వాత హసన్ అలీ 50 మ్యాచుల్లో 11 నోబాల్స్, 23 మ్యాచుల్లో కీమో పాల్ 11 నో బాల్స్ వేసి ఆ తరువాత స్థానాలలో ఉన్నారు.

భరత్ ఓటమి:

దీంతో భారత్ న్యూజిలాండ్ చేతుల్లో ఓటమి పాలైంది. 2023 లోని ఈ తొలి టీ20లో 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 155 పరుగులు చేసింది. 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

What do you think?

పెళ్లి పీటలెక్కుతాడనుకున్న కొడుకు కుప్పకూలిపోయాడు. కుటుంబానికి తీరని లోటును మిగిల్చాడు.

ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ( indiapostgds)పోస్టులు వచ్చేశాయి. వెంటనే రిజిస్టర్ చేసుకోండి. ఉద్యోగం కొట్టేయండి.