in

ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ( indiapostgds)పోస్టులు వచ్చేశాయి. వెంటనే రిజిస్టర్ చేసుకోండి. ఉద్యోగం కొట్టేయండి.

ఒక్క ఉద్యోగం కోసం, ఒకే ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక శుభవార్త. indiapostgds వాళ్ళు ఈ ఏడాదిలో కొత్త షెడ్యూల్ ను విడుదల చేశారు. 40889 పోస్టులు ఉన్నాయని ప్రకటించారు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారు కనీస అర్హత అయిన 10 వ తరగతి ఉతీర్ణులు అయ్యి ఉండాలి. దరఖాస్తు చేసుకునే వారు జనవరి 27 నుంచి చివరి తేది ఫిబ్రవరి 16 లోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.ఇక దరఖాస్తు చేసుకునే వాళ్ళు రూ 100 రుసుమును చెల్లించాలి. అయితే అమ్మాయిలు/ట్రాన్స్ జెండర్లు మరియు ఎస్ సి/ఎస్ టి క్యాండేట్లకు ఈ దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంది. వారు ఎటువంటి రుసుమును చెల్లించకుండా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక వేళ క్యాండేట్లు వారు ఇచ్చిన సమాచారంలో మార్పులు, చేర్పులు చేయాలనుకున్నా లేదా చేయాల్సి వచ్చినా ఫిబ్రవరి 17 నుంచి 19 ఫిబ్రవరి మధ్యలో ఎప్పుడైనా చేసుకోవచ్చు.
Gds కి దరఖాస్తు చేసుకునే విధానం
‌ముందుగా https://indiapostgdsonline.gov.in/ లోకి వెళ్లండి.
‌ రిజిస్టర్ చేసుకుని, దరఖాస్తును కొనసాగించండి.
‌అప్లికేషన్ లో మీ సమాచారాన్ని పూరించి, అవసరమైన వాటిని అప్లోడ్ చేయండి.
‌పత్రాలను మరియు రుసుమును చెల్లించి, అప్లికేషన్ను సమర్పించండి.
‌ ప్రింటవుట్ తీసుకోండి.

What do you think?

టీిం ఇండియా బౌలర్ అర్ష్ దీప్ ఒక కొత్త చెత్త రికార్డును తన కాతాలో వేసుకున్నాడు. ఒకే ఓవర్లో 27 పరుగులు సమర్పించుకున్నాడు.

ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ షెడ్యూల్ ను బోర్డ్ ప్రకటించింది. ఇంటర్ ఎగ్జామ్స్ ఎప్పుడంటే..