in

యువ జట్టుతో టీమ్ ఇండియా టీ20 సీరీస్ షురూ…..

కొత్త ఏడాది వచ్చేసింది.ఈ ఏడాదిలో కూడా తమ సత్తా చాటుతూ ఆటతో ఒక ఊపు ఊపడానికి టీమ్ ఇండియా సిద్దం అయిపోయింది. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌తో టీమ్ ఇండియా ఈ ఏడాదిని ప్రారంభించబోతుంది. వీటిలో తొలి మ్యాచ్ జనవరి 3 మంగళవారం నాడు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగబోతుంది.అయితే ఈ మ్యాచులో టీమ్ ఇండియా తారలు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్,రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్ తదితరులు ఆడక పోతుండటం విశేషం.

కాగా గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా నిష్క్రమించిన తరువాత బీసీసీఐ పొట్టి ఫార్మాట్‌లో యువ ఆటగాళ్లతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేశారు. చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేయగా, విరాట్ కోహ్లీ,కేఎల్ రాహుల్ రోహిత్ శర్మ వంటి సీనియర్లు ఈ సిరీస్ లో ఆడక పోవడంతో ఈ టీ20 సిరీస్‌ ను యువ ఆటగాళ్ళు ఎలా ఆడి, గెలిపిస్తారో….అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే త్వరలో మొదలయ్యే వన్డే సిరీస్‌లో మాత్రం మళ్ళీ సీనియర్ ఆటగాళ్ళు కనిపిస్తారట. హార్దిక పాండ్య ఈ టీ20 జట్టుకు యువ జట్టుకు కెప్టెన్ గా నాయకత్వం వహించబోతున్నాడు.

ఇక ఇటీవలే ప్రమాదానికి గురై ఆటకు దూరమైన రిషబ్ పంత్ గురించి హార్దిక పాండ్య మీడియాతో మాట్లాడుతూ “రిషబ్ ఉంటే బాగుండేదని, కానీ దురదృష్టవశాత్తూ ఇలా జరగడం జట్టులో పెద్ద తేడానే చూపుతుందని చెప్పుకొచ్చారు.రిషబ్ త్వరగా కొల్కోవాలని తనతో పాటు జట్టులో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని అన్నారు.”

What do you think?

106 Points
Upvote Downvote

10వ తరగతి పరీక్షల టైం టేబుల్ – పరీక్షలు మళ్ళీ వచ్చేసాయి

2023లో మహిళా ఐ.పి.ఎల్ ప్రారంభంకాబోతుందా…