in

37 ఏళ్ల వయసు నుండి 25 ఏళ్ల వయసు కుర్రాడిలా మారిన క్రిస్టియానో రోనాల్డో

రోజు వారి ఆహారపు అలవాట్ల వల్ల,ఆటల కంటే ఫోనులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల చిన్న వయసులోనే  బీపి,మధుమేహం లాంటి వ్యాధులకు చాలా మంది గురౌతున్నారు. అలాంటి ఈ కాలంలో తీసుకునే ఆహారం వల్ల,రోజు చేసే వ్యాయామం వల్ల 37 ఏళ్ల వ్యక్తి 25 ఏళ్ల కుర్రాడి శరీరం కలిగున్నాడంటే నమ్ముతారా…? వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ,కానీ ఇది నిజమేనండి. ప్రముఖ ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో రోజు వారి వ్యాయామం వల్ల తన అసలైన వయసుకన్న తన శరీరం తక్కువ వయసు కలిగుందట.

 

పోర్చుగీస్ ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియనో రోనాల్డో 18 ఏళ్ల వయసులో జాతీయ స్థాయిలో ఆడటం మొదలు పెట్టినప్పట్నుంచి లెక్క లేనన్ని అవార్డులు గెలుచుకున్నాడు. ప్రపంచం ఆశ్చర్యపోయేన్ని రికార్డుల సృష్టించాడు. ఇటీవల రోనాల్డో చేయించుకున్న కొన్ని వైద్య  పరీక్షల మూలంగా ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. రోనాల్డో వయసు 37 ఏళ్లు కాగా రోజూ వారి ఆహారపు అలవాట్ల వల్ల,వ్యాయామం వల్ల అతని శరీరం 25 ఏళ్ల వయసుండే వారి శరీరంలాగే ఉందట.

 

ఈ విషయం పై రోనాల్డో తన అభిప్రాయాన్ని తెలయచేస్తూ మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో శారీరిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని అన్నారు. అదేవిధంగా రోజు కొంత సమయం కుటుంబంతో గడపడం ద్వారా మానసిక ప్రశాంతత దొరుకుతుందని,తను కూడా తన కాళీ సమయాన్ని కుటుంబంతో గడుపుతానని తెలిపారు.

What do you think?

155 Points
Upvote Downvote

వీల్ చైర్ టు వరల్డ్ ఛాంపియన్… విథి కూడా కంపించింది

చరిత్ర సృష్టించిన 21 ఏళ్ల అమ్మాయి భూమిక శర్మ, “భారతదేశ జెండా అక్కడ ఎగర వేయడం చాలా ఆనందంగా అనిపించింది”