in

గోల్డ్ మెడలిస్ట్ నుంచి తనను తాను పోషించుకొలేని స్థితికి పడిపోయిన మీనాక్షి రాణీ.

మనిషి జీవితం ఎప్పుడూ ఒకరు ఆశించినట్టు ఉండదని కాలం ప్రతిసారి తెలియచేస్తూనే ఉంటుంది. ఆ విషయం యు.పీలోని బరేలీ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ మీనాక్షి రాణీ జీవితం రూపంలో మరోసారి నిర్ధారణ అయ్యింది.

మీనాక్షి రాణీ ఒకానొక సమయంలో భారతదేశ క్యాతిని పెంచింది, ఎన్నో పథకాలు అందుకుంది. 1995లో వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ నేషనల్ సిల్వర్ మెడల్ని అందుకుంది. ఆ తరువాతి ఏడాది గోల్డ్ మెడల్ని,1998లో మధ్యప్రదేశ్లో జరిగిన నేషనల్ ఛాంపియన్షిప్ మరోసారి సిల్వర్ మెడల్ను సొంతం చేసుకుంది. 1999లో ఢిల్లీలో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్లో బ్రాంజ్ మెడల్ని కూడా అందుకుంది. 2005-2006 మద్యలో నేతాజీ సుభాష్ నేషనల్ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ నుంచి కోచింగ్ సర్టిఫికేట్ కూడా పొందింది. ఆపై 2007 నుంచి 2011 వరకు ఫిరోజబాద్లో ఎస్.ఏ.ఐ కోచ్ గా కూడా వ్యవహరించింది.

కానీ అప్పుడే ఆమె ఊహించని విధంగా తన జీవితం మారిపోయింది.2011లో తన భర్త అనుకోని ప్రమాదంలో చనిపోగా,మీనాక్షి కాలుకు గాయం అయ్యింది. దాంతో తన ఉద్యోగం కూడా చేజారీ పోయింది. గాయాలకు వైద్యం చేయించుకోవడం కోసం ఉన్న ఇల్లును అమ్ముకోవాల్సి వచ్చింది. దానికి తోడు తన కుటుంబ బాధ్యతంతా తన భుజాలపైన పడింది. తన ఇద్దరు పిల్లల్ని పోషించుకోలేని పరిస్థితి రావడంతో అప్పటి స్పోర్ట్స్ మినిస్టర్ అయిన నారద్ రాయ్ని మరియు స్పోర్ట్స్ కన్సల్టెంట్ అయిన రామ్వ్రిక్ష్ యాదవ్లన్ తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరింది. వాళ్లు ఇప్పిస్తామని హామీ కూడా ఇచ్చారు కానీ ఎన్ని రోజులకీ తన ఉద్యోగంపై సమాచారం లేకపోవడంతో మీనాక్షి ఉత్తరప్రదేశ్ విధాన్ సభ బయట నిరసనకు దిగింది.

తనను తాను పోషించుకొనే స్థితిలో లేనని, మినిస్టర్ గారు మాటిచ్చిన ప్రకారం ఇంకో 10 రోజులలో ఉద్యోగం ఇప్పించకపోతే తనకు ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదని వాపోయింది.ఎస్.ఏ.ఐలోనైన తన మునుపటి ఉద్యోగం తనకు ఇప్పించమని కోరింది. ఒక గోల్డ్ మెడలిస్ట్ నుంచి ఉద్యోగం కోసం రోడ్డు పై నిరసనకు దిగే స్థాయికి వచ్చిన మీనాక్షి రాణీ జీవితం ఎవరూ ఊహించలేనిది,ఎవరికీ రాకూడనిధి. ఇంకో బాధాకరమైన విషయంఏంటంటే ఆమె నిరసన చేసిన తరువాత తనకు ఉద్యోగం వచ్చిందా…అసలు తను ఏమైంది అన్న విషయం ఇప్పటికీ ఎవరికీ తెలియలేదు.

What do you think?

41 Points
Upvote Downvote

క్రీడా ప్రపంచానికి వీడ్కోలు చెప్పిన రోజర్ ఫెడరర్, “శరీరం ఇస్తున్న సందేశాలు నాకు అర్ధమయ్యాయి”

గెలుపుతో పాటు జీవితాన్ని కూడా తీసుకెల్లిపోయిన ఆట…నాక్ ఔట్