in ,

“విషయాన్ని వక్రీకరించొద్దు”…రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంపై ఎస్.ఎస్.పి అజయ్ సింగ్ వివరణ

భారత్ యువ క్రికెటర్ రిషబ్ పంత్ ఇటీవలే జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రిషబ్ పంత్ కి ప్రమాదం జరిగిన సమయంలో కొంతమంది ఆయనకు సహాయం చేయడంపోయి తన దగ్గర ఉన్న వస్తువులను,డబ్బును దోచుకుని పోయారని ఒక విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
కాగా ఈ విషయంపై వెలువడిన ఆరోపణలను కొట్టి పారేస్తూ ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ అయిన అశోక్ కుమార్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఇది తప్పుడు సమాచారం మాత్రమేనని చెబుతూ ఎస్.ఎస్.పి అజయ్ సింగ్ వివరిస్తున్న ఒక వీడియోని పోస్ట్ చేశారు. అశోక్ కుమార్ పోస్ట్ చేసిన విడియోలో ఎస్.ఎస్.పి అజయ్ సింగ్ మాట్లాడుతూ రిషబ్ పంత్ కు ప్రమాదం జరిగినప్పుడు దొంగతనం జరిగిందన్న విషయం పుకారే కానీ దాంట్లో ఎంతమాత్రం నిజం లేదని అన్నారు.

ప్రమాదం జరిగిన సమయంలో ఆ చుట్టు పక్కల ఉన్న పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారని, ఆయన గాయాలకు ప్రాధాన్యత ఇచ్చి అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన తరువాత మాక్స్ హాస్పిటల్ కి తరలించారని వివరించారు. ఆ తరువాత ఆయనకు చెందిన ఒక వాచ్చు, గోల్డెన్ బ్రేస్లెట్ ఇంకా ఆయన బట్టల్లో ఉన్న 4 వేల రూపాయలను జాగ్రత్తగా రిషబ్ కుటుంబానికే అందచేసామని, ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న వారందరూ రిషబ్ కి సాయం చేశారే తప్ప, ఎవరూ దొంగతనం చేయలేదని చెప్పారు. వాళ్ళు అక్కడ ఉన్న సి.సి.టీవీలో ఫుటేజ్ ని పూర్తిగా పరీక్షించిన తరువాతే ఈ విజయాన్ని ఇంత కచ్చితంగా చెబుతున్నామని వెల్లడించారు.

చాలా మంది సోషల్ మీడియాలో వ్యూస్, లైక్ల కోసం ఈ విధంగా విషయాన్ని వక్రీకరించి పోస్ట్ చేశారని చెప్పుకొచ్చారు. ఇక రిషబ్ పంత్ కి ప్రమాదం జరిగినప్పుడు కాలుతున్న కారులో నుంచి బయటకు తీసి గుడ్డతో ఆ మంటలు ఆపి ప్రాణాలు కాపాడిన డ్రైవర్ సుశీల్ కుమార్ కి ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు.

What do you think?

106 Points
Upvote Downvote

రిప్లేసింగ్ MSD ఆన్ ఫీల్డ్ ఎర్రర్ 404 నాట్ ఫౌండ్

“నన్ను నువ్వు సంతోషంగా చూసుకుంటే, నిన్ను నేను సంతోషంగా చూసుకుంటా”- క్రీడా మంత్రి లైంగికంగా వేధించాడంటూ మహిళా కోచ్ ఆరోపణలు