in

రిప్లేసింగ్ MSD ఆన్ ఫీల్డ్ ఎర్రర్ 404 నాట్ ఫౌండ్

MSD(మహేంద్ర సింగ్ ధోనీ)ఫార్మర్ ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్. సక్సెఫుల్ కెప్టెన్, బెస్ట్ ఫినిషర్, గ్రేట్ వికెట్ కీపర్ గా రాణించిన మహి రిటైర్మెంట్ తీసుకొని దాదాపు రెండేళ్లు కావొస్తున్నా ఇండియా మ్యాచ్ జరిగిన ప్రతిసారి ఆయన పేరు ట్రెండ్ అవుతూనే ఉంది. దీనికి కారణం ఎలాంటి సిట్యుయేషన్ లో ఉన్నా గేమ్ ని తిరిగి కంట్రోల్ లోకి తెచ్చే మహీ మైండ్ గేమ్, డు ఆర్ డై మ్యాచ్లలో అతని ప్రెజన్స్ ఆఫ్ మైండ్, రిస్క్ టేకింగ్, టీం పైన ప్రెషర్ పడకుండా కూల్ గా కంట్రోల్ చెయ్యడం అతనికి విజయ సూత్రాలు అని చెప్పొచ్చు.

గతంలో చూసుకుంటే ఆఖరి బాల్ వరకు వచ్చి గెలిచిన వాటిల్లో అన్నీ ఐకానిక్ మ్యాచ్స్ గా నిలిచాయి. చాలా సార్లు రిషబ్ పంత్ కీపింగ్ లో ధోనిలా ట్రై చేసి విఫలం అయ్యాడు, అయితే విఫలం అయిన ప్రతిసారి టీమ్ ఇండియాకి ధోనీ అందించిన సేవ ఎవరి వల్ల కాదు, ధోనీ ని ఎవరు రిప్లేస్ చెయ్యలేరు అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో  #Dhoni తో ట్రెండ్ చేయసాగారు.

ఈ విధంగానే ఇటీవల జరిగిన ఆసియా కప్ లో టీమ్ ఇండియా నిష్క్రమణ పై క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తు నిరాశ వ్యక్తం చేశారు. టీమ్ ఇండియాలో ధోనీ ప్లేస్ ని బర్తీ చేసే క్రికెటర్ కోసం ఎదురుచూపు ఇంకా కొనసాగుతూనే ఉందని నెటిజన్ల వాదన. ధోనీ ఆలోచన తీరు,పద్ధతి అందరికంటే భిన్నంగా ఉంటుందని హర్ష భోగ్లే ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో వ్యాక్యించారు. ఇన్నేళ్ల పరిచయంలో అయన ధోనీని బయట ఒక్కసారే కలిసానని, ధోనీ తనకంటూ ఒక మొబైల్ ఫోన్ కూడా క్యారీ చెయ్యరని చెప్పుకొచ్చారు.

What do you think?

254 Points
Upvote Downvote

చీకటి పడితే అసలు అక్కడ ఊరు ఉందన్న సంగతి ఎవరికీ తెలియదు

“విషయాన్ని వక్రీకరించొద్దు”…రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంపై ఎస్.ఎస్.పి అజయ్ సింగ్ వివరణ