in

చీకటి పడితే అసలు అక్కడ ఊరు ఉందన్న సంగతి ఎవరికీ తెలియదు

మనము రవి అస్తమించని దేశం గురించి చదువుకున్నాం కానీ చీకటి పడితే కనపడని నగరాలు కూడా మనదేశంలో ఉన్నాయి. కనీస అవసరాలైన విద్యుత్, మంచినీటి సౌకర్యం , వైద్య సదుపాయాలు లేకుండానే ఇక్కడ ప్రజలు జీవిస్తున్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎంతో మంది నాయకులు వచ్చి వెళ్లారు.. కానీ వారి పరిస్థితులు మాత్రం మారలేదు.

వాటిలో ఒకటి .. మన రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మెంటాడ దగ్గరలోని బూరుగు గ్రామం. దీనిని గిరిశిఖర గ్రామం అని కూడా పిలుస్తారు..ఇలాంటి ఊళ్ళు మన చుట్టూ ఇంకా ఎన్ని ఉన్నాయో.. మనిషి చనిపోతే నలుగురు మోస్తారు, కానీ ఇక్కడ బతికుండగానే వైద్య సౌకర్యం కోసం ఇద్దరు మోసుకుంటూ తీసుకెళతారు. ఇది ఎంతో దయనీయ కరం. మంచినీటి కోసం ఇంచుమించు రెండు మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాలి.. ఇక చదువుకి అక్కడ స్థానమే లేదు,  చదువుకోవాలంటే ఆరు కిలోమీటర్ల కొండ దిగి పిల్లలు వెళ్లి చదువుకోవాలి.. చీకటి పడితే అసలు అక్కడ ఊరు ఉందన్న సంగతి ఎవరికీ తెలియదు..కరెంటు మాటే లేదు..భూమిపై నివసిస్తున్న మరో గ్రహాంతరవాసులలా జీవిస్తున్నారు.

ఒక వ్యక్తి లోని టాలెంట్ పదిమందికి చేరేదాక పోస్ట్లు పెట్టె నెటిజెన్స్ కు ఇలాంటి నగర కష్టాలను కూడా పట్టించుకుని ..పది మందికి చేర్చాలనే ఆలోచన వస్తే బాగుండేది. ఏ ప్రభుత్వం అయినా కదిలేది, ఏదో ఒక సంస్థ స్పందించేది, లేదా ఏ మనసున్న మారాజో ముందుకొచ్చి గ్రామాలను దత్తత తీసుకునేవారు.

What do you think?

116 Points
Upvote Downvote

సైనికుడు….అగ్నివీరుడు అవుతాడా! అసలేంటీ అగ్నిపత్ స్కీము?

రిప్లేసింగ్ MSD ఆన్ ఫీల్డ్ ఎర్రర్ 404 నాట్ ఫౌండ్