in

అరేబియా నేల పై భారత్ vs పాకిస్థాన్ ముఖా ముఖి

భారత్ vs పాకిస్థాన్ (ఆసియా కప్ 2022)

వేదిక దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

 

క్రికెట్ అభిమానులు అందరు ఆశక్తిగా ఏదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. UAE హోస్ట్ చేస్తున్న ఆసియా కప్ 2022 ఈ నేల 27 న మొదలైన విషయం అందరికి తెల్సిందే. మొదటి మ్యాచ్లో శ్రీలంక ఆఫ్ఘనిస్థాన్ తలపడగా ఆఫ్ఘనిస్థాన్ 8 వికెట్ల తేడాతో విజయాన్ని వసం చేస్కుంది. నేడూ ఆసియా కప్ లోని భాగం గా రెండో మ్యాచ్ లో ఇండియా పాకిస్థాన్ తలపడనున్నాయి. రెస్ట్ లో ఉన్న విరాట్,కెఎల్ రాహుల్ తిరిగి స్క్వాడ్ లోకి రావడం టీమ్ కి మరియూ క్రికెట్ ఫ్యాన్స్ కి మంచి ఉత్సాహాన్ని ఇస్తోంది.ఇక బౌలర్లు భువనేశ్వర్, అవేష్ ఖాన్, చాహల్ గత మ్యాచ్‌లలో చక్కటి ప్రతిభ చూపించి మంచి ఫామ్‌లో ఉన్నారు రిషబ్,సూర్య కుమార్ మరియూ ఆల్‌రౌండర్లు హార్దిక్,జడేజాలతో మిడిల్ ఆర్డర్ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. కెప్టెన్‌గా రోహిత్ మంచి సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగిస్తున్నాడు.ఆసియా కప్ లో ఇండ్-పాక్ 13 సార్లు తలపడగా (8-5) భారత్ కే అత్యధిక విజయాల రికార్డు ఉంది.

గత యేడాది UAE లో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో ఆడిన 17 మ్యాచ్‌లలో 16 మ్యాచ్‌లు గెలిచి సెమీఫైనల్స్‌కి వచ్చిన పాకిస్థాన్ సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమికి గురైంది. ఈరోజు జరగబోయే మ్యాచ్ లో టీమ్ ఇండియా రాణించి పాకిస్థాన్ పైనా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతీ భారతీయుడి ఆశ

ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా

What do you think?

142 Points
Upvote Downvote

బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ ‘సాహో’ కి మూడేళ్లు