in

బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ ‘సాహో’ కి మూడేళ్లు

‘సాహో’ ఈ పేరు చేసిన హంగామా ఏంటో తెలియని వాళ్ళు ఉండరు. ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో uv క్రియేషన్స్ భారి నిర్మాణ విలువలతో తెరకెక్కించిన చిత్రం సాహో. బాహుబలి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తరువాత ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ యాక్షన్ హీరో నటించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై గొప్ప సెన్సేషన్ గా నిలిచింది.

కథ పరంగా ఈ చిత్రం అభిమానుల అంచనాలని రీచ్ కాలేకపోయినా ప్రభాస్ తన స్క్రీన్ ప్రెసెన్స్ తో భారీ ఫైట్స్ తో అలరించగా, సుజిత్ తన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులని కట్టి పడేసాడు. రిలీజ్ అయినా మొదటి ఆట నుంచే ప్లాప్ టాక్ వచ్చినా టాక్ తో సంబంధం లేకుండా కాసుల వర్షం కురిపించి నిర్మాతలకు లాభాన్ని తెచ్చిపెట్టి ప్రభాస్ కెరీర్ లో రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ఇచ్చిన మూవీ గా నిలిచింది.

ఈ సినిమా విడుదల అయ్యి రేపటికి(ఆగస్టు 30) మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు #3YearsForSaahoBORage అని ట్రెండ్ చేస్తు ఈ టాపిక్ ని ట్విట్టర్ ట్రెండింగ్ టాపిక్స్ లో టాప్ పొజిషన్ లో ఉంచారు.

What do you think?

అరేబియా నేల పై భారత్ vs పాకిస్థాన్ ముఖా ముఖి

జనసేనానికి జన్మదిన శుభాకాంక్షలు