in

జనసేనానికి జన్మదిన శుభాకాంక్షలు

‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్'(జనసేనానికి) చిన్న, పెద్దా అని వయసుతో సంబంధం లేకుండా లక్షల సంఖ్య లో అభిమానులని సొంతం చేసుకున్న వ్యక్తి. మెగా స్టార్ చిరంజీవి తమ్ముడిగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా తో తెరంగ్రేటం చేసిన పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో జిమ్నాస్టిక్స్, స్టంట్స్, ఫైట్స్ చేసి కుర్రకారులో తనకంటూ ఒక ప్రత్యేకత ని ఏర్పరుచుకొని  అతి తక్కువ సమయం లో పవర్ స్టార్ గా ఎప్పటికి చెరిగిపోని ముద్ర వేసాడు.

ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్బస్టర్స్ తో పాటు డిజాస్టర్స్ ని కూడా రుచి చూసిన పవన్ కళ్యాణ్, నైతికవిలువలతో, మానవతా దృక్పధం తో ప్రజలకి సేవ చేయడమే ధ్యేయం గా పెట్టుకొని రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. సెప్టెంబర్ 2 అయన జన్మదిన సందర్బంగా అయన సూపర్ హిట్ మూవీస్ ‘తమ్ముడు’ మరియు ‘జల్సా’ ని మళ్ళీ థియేటర్లలో రీరిలీజ్ చేసుకొని అభిమానులంతా సందడి చేశారు. 51 సంవత్సరాలు పూర్తి చేసుకొని 52వ సంవత్సరం లోకి అడుగుపెడుతున్న(జనసేనానికి) పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు💐(Birthday).

What do you think?

124 Points
Upvote Downvote

బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ ‘సాహో’ కి మూడేళ్లు

బి-టౌన్ లో ‘సీతారామం’ సందడి