in

బి-టౌన్ లో ‘సీతారామం’ సందడి

‘సీతారామం’ ఇటీవల విడుదలైన ఈ సినిమా కంటెంట్ పరంగా, కలెక్షన్ పరంగా బ్లాక్బస్టర్ అయిన విషయం తెలిసిందే. డుల్కర్ సాల్మన్, మృణాల్ ఠాకూర్ లీడ్ ఆక్టర్స్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో సక్సెస్ఫుల్ నిర్మాత అశ్వినీ దత్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళం లో విడుదలై క్లాసికల్ హిట్ గా నిలిచింది. సౌత్ లో మంచి ఆదరణ పొందిన ఈ చిత్రాన్ని ఈరోజు (సెప్టెంబర్ 2) హిందీ లో రిలీజ్ చేశారు.

ఊహించిన రీతిలోనే నార్త్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది మొదటి రోజు కల్లెక్షన్ సుమారు 1.25 కోట్ల గ్రాస్ ని రీచ్ అవ్వొచ్చు అని సినీ వర్గాల అంచనా.ఈ సినిమా డైరెక్టర్ గా  అటు హను కి హీరో గా ఇటు డుల్కర్ కి మంచి పేరు తెచ్చింది. ఇంక సీత క్యారెక్టర్ కి అయితే ఫ్యాన్స్ అవ్వని వాళ్ళు లేరు అని చెప్పొచ్చు. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తో అన్ని వర్గాలనూ అలరిస్తున్న ఈ చిత్రం డుల్కర్ కి కరీర్ బిగ్గెస్ట్ హిట్ అవుతుందో లేదో చూడాలి.

What do you think?

97 Points
Upvote Downvote

జనసేనానికి జన్మదిన శుభాకాంక్షలు

సొంత గడ్డపైనే ఆసీస్ కు వణుకు పుట్టించిన జింబాబ్వే….