in

2023లో మహిళా ఐ.పి.ఎల్ ప్రారంభంకాబోతుందా…

ఎప్పటికప్పుడు క్రికెట్ టోర్నమెంట్లు జరుగుతునే ఉన్నప్పటికీ ఐ.పి.ఎల్ అంటే అభిమానుల గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. పిల్లల్నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఐ.పి.ఎల్ జరుగుతునన్ని రోజులు దాని గురించే మాట్లాడుకుంటారు. ఈ సారి విన్నర్ ఎవరూ కాబోతున్నారా…అని కళప్పగించి వీక్షిస్తుంటారు. అలాంటి ఐపీఎల్ ప్రేక్షకులకు ఇప్పుడు మరింత వినోదం అందబోతుంది.

ఏప్రిల్ 18,2008లో తొలి సారిగా ప్రారంభం అయిన ఐపీఎల్ ఈ ఏడుకి 15 సీజన్స్లు ఆడగా, యెనిమిది జట్లుతో మొదలైన ప్రయాణం పది జట్లకు చేరింది. అయితే ఇప్పటి వరకు మగ ఆటగాళ్ళు మాత్రమే ఆడుతూ వస్తున్న ఐ.పి.ఎల్ త్వరలో మహిళలతో కూడా ప్రారంభించబోతున్నామని బి.బి.సి.ఐ తెలియచేయడంతో ఇప్పుడది హాట్ టాపిక్గా మారింది.

కొన్నేళ్ళ నుంచి మహిళలతో కూడా ఐపీఎల్ టోర్నీను ప్రారంభించడంపై చర్చలు జరుగుతుండగా 2023లో 5 జట్లతో మహిళా ఐపీఎల్ టోర్నీను మొదలు పెట్టాలని బి.సి.సి.ఐ తాజాగా నిర్ణయం తీసుకుంది. అందులో ఫ్రాంచైజీని దక్కించుకోవడానికి కనీస ధరను రూ.400 కోట్ల రూపాయలుగా నిర్ణయించారని అనుకుంటుండగా, బిడ్డింగులో ప్రతి ఫ్రాంచైజీ ధర వెయ్యి కోట్లకు దాటుతుందని బోర్డు అంచనా వేస్తుందట. అలాగే బహిర్గతం చేయని బిడ్ల ద్వారా మహిళా ఐపీఎల్ టెండర్ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేయనున్నారట.

అదే విధంగా ఇందులో పురుషుల ఐపీఎల్ ఫ్రాంచైజీ వాళ్ళు కూడా పాల్గొనవచ్చని తెలియచేశారు. ఇక టోర్నీ ప్రారంభం విషయానికి వస్తే 2023, మార్చ్ నెలలో ఈ మహిళా ఐపీఎల్ తొలి సీజన్ జరుగుతుందని బోర్డ్ వాళ్ళు చెప్తున్నారు. చూడాలి మరి ఈ మహిళా ఐ.పి.ఎల్లో ఆ 5 జట్లలో ఎవరెవరు ఆడబోతున్నరో… విన్నర్ ఎవరూ కాబోతున్నారో…

What do you think?

123 Points
Upvote Downvote

యువ జట్టుతో టీమ్ ఇండియా టీ20 సీరీస్ షురూ…..

అదరగొడుతున్న భారత్ షూటర్లు…